సూపర్ స్టార్ మహేష్ బాబు, కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా పనులు వేగంగా జరుగుతున్నాయి. 90 కోట్లతో తెలుగు, తమిళ్ భాషల్లో నిర్మితం కానున్న ఈ మూవీలో మహేష్ విభిన్నలుక్ తో కనిపించనున్నారు. తమిళ్ వెర్షన్ కి కూడా ప్రిన్సే స్వయంగా డబ్బింగ్ చెప్పనుండడం విశేషం.
ఈ చిత్రం జులై 29 నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇందుకోసం హైదరాబాద్లో భారీ సెట్ వేస్తున్నారు. ఈ సెట్లో పరిణీతి చోప్రా, మహేష్ లపై పాటను చిత్రీకరించనున్నారు. ఈ షూటింగ్ ఐదు రోజుల పాటు సాగనుంది. ఈ ఫిల్మ్ కి హరీష్ జైరాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత సంతోష్ శివన్ తొలిసారి తెలుగు సినిమాకు కెమెరామెన్ గా పనిచేస్తున్నారు.
భారీ తారాగణంతో ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ చిత్రం ఎక్కువ భాగం పూణేలో షూటింగ్ జరుపుకోనుంది. హైరాబాద్లో పాట పూర్తి అయినా తర్వాత చిత్ర బృందం పూణేకి బయలు దేరనుంది. ఆగస్టు మొత్తం అక్కడే కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.