‘అ..ఆ’ లో అదిరిపోయే డైలాగ్స్ ఇవే…

  • June 3, 2016 / 01:09 PM IST

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పెన్నునుంచి వచ్చేవి మాటలు కాదు. గారెలు. ఎంత తిన్నాతినాల నిపిస్తాయి. అందుకే ఆయన మాటల కోసమే సినిమాకు పోయే వాళ్లు చాలా మందే ఉన్నారు. తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన “అ..ఆ” లోనూ పదునైన పంచ్ లకు కొదవలేదు. ఈ సారి మహిళలను టార్గెట్ చేసి పేల్చిన మాటల మతాబులు.. థియేటర్ల నిండా చప్పట్ల వర్షం కురిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ డైలాగ్ లను  అమ్మాయిలు భలే ఎంజాయ్ చేస్తున్నారు. అవేంటో ఓ సారి.. మీరు చదివి రుచి చూడండి.

డైలాగ్ 1 : వాచ్ ఉన్న ప్రతివాడూ టైం వస్తుంది అనుకుంటాడు.. టైం తెలుస్తుందంతే..

డైలాగ్ 2 : అత్తారింటికి మా అమ్మాయి ఏడు వారాల నగలతో వెళుతుంది.. అదే మీ చెల్లెలు అయితే ఏడ్చుకుంటూ వెళుతుంది.

డైలాగ్ 3 : రావణాసురుడి మమ్మీ డాడీ కూడా శూర్పణఖను సమంతే అనుకుంటారు కదే.

రావణాసురుడి పెళ్లాం కూడా వాళ్ల ఆయన్ను పవన్ కల్యాణే అనుకుంటుంది.

డైలాగ్ 4 : ఏ చీర కట్టుకోవాలని అడిగావ్.. కట్టుకున్న వాడి గురించి మాత్రం ఒక్క మాట చెప్పలేదు.

డైలాగ్ 5 : రోడ్డు వైడెనింగ్లో సగం కొట్టేసిన బిల్డింగ్ లా అయిపోయింది నా బతుకు. ఉండటానికి పనికి రాదు, వదలటానికి మనసు రాదు

డైలాగ్ 6 : శత్రువులు ఎక్కడో ఉండర్రా..! ఇదిగో మన చుట్టూ ఇలా కూతుళ్లు, చెల్లెళ్ళ రూపంలో తిరుగుతూ ఉంటారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus