Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

హీరోగారూ.. సినిమాలో కాస్త పేస్‌ తగ్గుతోంది.. ఏం చేద్దాం?
డైరక్టర్‌ గారూ.. థియేటర్‌లో జనం ఊగాలి.. ఏం చేద్దామంటారు?
సినిమా వైబ్‌ కాస్త డౌన్‌ ఉంది మాస్టారూ.. ఏం చేద్దా మరి..
ఈ ప్రశ్నలకు ఒకప్పుడు ఏం సమాధానం వచ్చేదో తెలియదు కానీ.. ఇప్పుడు అయితే ఒకే ఒక సమాధానం ఓ హిట్‌ ‘సింగిల్‌’ పట్టు. అవును మీరు చదివింది కరెక్టే. తెలుగు సినిమాలో హిట్‌ వైబ్‌ను ఇప్పుడు తెలుగు సింగిల్‌ సాంగ్స్‌ తీసుకొస్తున్నాయి. మొన్నటికి మొన్న ఇలానే చేసి స్లో అవుతున్న సినిమాను ఫుల్‌ హైలోకి తీసుకెళ్లి విజయం సాధించారు రవితేజ. ‘ధమాకా’ సినిమా గురించి ఇదంతా మాట్లాడుతోంది అని మీకు అర్థమయ్యే ఉంటుంది.

Tollywood

ఇటీవల ఇదే ఫార్ములాను ఉపయోగించి మరోసారి విజయం అందుకున్నాడు రవితేజ. అప్పటికే హిట్‌ టాక్‌ వచ్చిన ఆ సినిమాకు ఆ పాట విజయం తోడై థియేటర్లలో జనాలు ఊగిపోతున్నారు. ఆ వైబ్‌ సినిమాకు రికార్డు విజయాన్ని అందించారు. ఆ సినిమానే ‘ఇరుముడి’. ఆ పాట ‘మల్లెపూల పల్లకి..’ అని సాగే అయ్యప్పస్వామి పాట. ఈ పాట ఆ సినిమాకు ఇచ్చిన ప్లస్‌ ఎలిమెంట్‌ మీకు ఇప్పటికే అర్థమయ్యే ఉంటుంది. థియేటర్లలో ఈ పాటకు డ్యాన్స్‌లతో ఫ్యాన్స్‌, ప్రేక్షకులు సందడి చేస్తున్నారు.

ఇప్పుడు ఇలాంటి ప్రయత్నమే చేసినట్లున్నారు నాని – శ్రీకాంత్‌ ఓదెల. తమ సినిమా ‘ప్యారడైజ్‌’ కోసం ‘ఏష నాగుల..’ అంటూ సాగే ఈ పాటకు ఒరిజినల్‌ తెలుగు సింగిల్‌ సాంగ్‌ అనే విషయం తెలిసిందే. ఇప్పటికే తెలంగాణ సంప్రదాయ జానపద సంగీతంలో, సింగిల్స్‌ చరిత్రలో ఈ పాటకు పెద్ద చరిత్రే ఉంది. ఇప్పటికే ఈ పాటకు సోషల్‌ మీడియాలో, స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌లో మంచి హై కనిపిస్తోంది. ఇక ఈ పాట థియేటర్‌లో చూస్తే పరిస్థితి ఎలా ఉంటుందో మరి.

ఇదంతా చూస్తుంటే.. మంచి హిట్‌ సింగిల్‌ సినిమాలో పెట్టి.. వైబ్‌ను సంపాదించేస్తున్నారు. అయితే దానికి సినిమా హిట్‌ కలిస్తేనే ఉపయోగం లేదంటే కష్టమే. చూద్దాం మరి ఏమవుతుందో?

8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus