సినిమా అనౌన్స్ చేయలేదు కానీ.. అప్పుడే రెమ్యూనరేషన్ గోలేంటి?

  • October 31, 2019 / 08:15 PM IST

పవర్ స్టార్ కళ్యాణ్ క్రేజ్ గురించి మాటల్లో చెప్పలేం.! దానికి ఆకాశమే హద్దు అని చెప్పాలి. ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో బిజీగా గడుపుతున్నారు. ‘జనసేన’ పార్టీని బలోపేతం చేయడానికి చాలా కృషి చేస్తున్నారు. అయితే ఎన్నికలకి చాలా సమయం ఉంది కాబట్టి.. సినిమాలు చేయమంటూ అభిమానులు విన్నపిస్తున్నా.. ఆయన ఇంట్రెస్ట్ చూపట్లేదు. అయితే అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి చొరవ చేసుకుని ‘సినిమాలు చేయమని కోరగా’ దానికి ఆలోచిస్తాను అంటూ జవాబిచ్చారట పవన్. ఇక ఇటీవల రాంచరణ్ కూడా ‘బాబాయ్ కథలు వింటున్నారు’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఈ క్రమంలో పవన్ హీరోగా క్రిష్ డైరెక్షన్లో ఓ సినిమా రూపొందనుందంటూ వార్తలు వస్తున్నాయి. అయితే సినిమా ఇంకా అనౌన్స్ చేయలేదు కానీ అప్పుడే.. ‘పవన్ చేయబోయే సినిమాకి పవన్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటాడు’ అనే చర్చ మొదలైంది. ఎందుకంటే పవన్ మార్కెట్ చాలా పెద్దది. కచ్చితంగా ఆ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని సినిమా నిర్మించాలి. కాబట్టి సినిమా బడ్జెట్ లో సగం ఉంటుంది అని అప్పుడే చాలామంది ఎస్టిమేషన్లు వేసేస్తున్నారు. అయితే పవన్ తో సినిమాని నిర్మించే బడా నిర్మాత ఎవరు అనేది తెలియాల్సి ఉంది.

విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus