కొన్ని సినిమాల భాష అనే ఎలిమెంట్ లెక్కలోకి తీసుకోకూడదు అంటారు. కంటెంట్‌లో కావాల్సినంత స్పెషల్ ఉంటే ఎవరైనా చూస్తారు అని చెబుతారు. ఈ మాట ఇప్పటిది కాదు. ఓటీటీలు రాకముందు నుండే ఉంది. ఓటీటీ హవా పెరిగాక ఇది ఏదో కొత్త విషయంలా ఇప్పుడు మాట్లాడుతున్నారంతే. ఆ వదిలేస్తే ఇప్పుడు ఓ తమిళ సినిమా అందులో బో*ల్డ్ అనే ట్యాగ్ తగిలించుకున్న సినిమా ఇప్పుడు ఓటీటీల్లోకి వస్తోంది. అదేంటి ఓటీటీలోకి కదా.. ఓటీటీల్లోకి అంటున్నారు అనుకుంటున్నారు. ఎందుకంటే ఆ సినిమా ఆరు ఓటీటీల్లోకి ఒకేసారి వస్తోంది.
2024లో తమిళ సినిమా పరిశ్రమను షేక్ చేసిన సినిమా ‘హాట్ స్పాట్’. విఘ్నేష్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమాజంలో చర్చించడానికే భయపడిన ఎన్నో అంశాలను ప్రస్తావించారు. అప్పట్లో ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ కూడా వచ్చింది. ‘హాట్ స్పాట్ 2 మచ్’ అంటూ గత నెల 23న రిలీజ్ చేశారు. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది. ఒకే రోజు 6 ఓటీటీల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఫిబ్రవరి 20 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా తమిళం, లయన్స్ గేట్ ప్లే, సింప్లీ సౌత్, షార్ట్ ఫ్లిక్స్, ఏపీ ఇంటర్నేషనల్ సౌత్ ఓటీటీల్లో ఈ సినిమాను స్ట్రీమ్ చేయనున్నారు. విఘ్నేష్ కార్తీక్ తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్, ఎంఎస్ భాస్కర్, తంబి రామయ్య, రక్షన్, అశ్విన్ కుమార్, ఆదిత్య భాస్కర్, భవానీ శ్రీ, సంజన తివారీ తదితరులు కీలకపాత్రలు పోషించారు. తొలి సినిమా అందించిన విజయం రెండో సినిమా అందించలేదు.
ఇక సినిమా కథ విషయానికొస్తే… సినిమా హీరోల పట్ల అభిమానం పిచ్చిగా మారిపోతే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి, స్వలింగ సంపర్కుల వివాహం గురించి జరిగే చర్చ, ఓ వ్యక్తి తనకు నచ్చిన బట్టలు వేసుకునే హక్కు – సమాజం చూసే చూపులు అనే కాన్సెప్ట్ అంటూ వివిధ కథల కాంబినేషన్‌గా ఈ సినిమా తెరకెక్కింది.