Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

‘అంజి’ మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) డిజాస్టర్ సినిమాల లిస్టుని తీస్తే ఇది కూడా టాప్ లో ఉంటుంది. ఇప్పటి ఆడియన్స్ ఈ సినిమాని ఎంత అండర్ రేటెడ్ అంటూ నెత్తిన పెట్టుకున్నప్పటికీ.. ఆ టైమ్లో ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి కెరీర్..కి చాలా డ్యామేజ్ చేసింది. అదెలాగో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ‘అంజి’ చిత్రాన్ని కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఆ రోజుల్లోనే ఈ సినిమాని రూ.28 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు.

Chiranjeevi

7 ఏళ్ళ పాటు ప్రొడక్షన్ దశలోనే ఉండిపోయింది ఈ సినిమా. ఈ కారణాల వల్ల చిరంజీవి ‘ప్రైమ్ టైమ్’ లో చాలా మంచి ప్రాజెక్టులు మిస్ చేసుకోవాల్సి వచ్చింది. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

1)వందేమాతరం : క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి చేయాల్సిన సినిమా ఇది. చాలా ప్రెస్టీజియస్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని కృష్ణవంశీ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు. కానీ ‘ ‘అంజి’ సినిమా కంప్లీట్ చేశాకే చేద్దామని’ చిరు చెప్పారట. కృష్ణవంశీ కూడా ఒకరి కోసం వెయిట్ చేసే రకం కాదు.. కాబట్టి, ఆయన వేరే ప్రాజెక్టులకి షిఫ్ట్ అయిపోయారు.

  

2) నరసింహ నాయుడు : ‘నరసింహనాయుడు’ మెగా అభిమానులకి ఓ నైట్ మేర్. ఎందుకంటే ఈ సినిమాకి పోటీగా రిలీజ్ అయిన మెగాస్టార్ చిరంజీవి ‘మృగరాజు’ సినిమా దారుణంగా ఫ్లాప్ అయ్యింది. కానీ మెగా అభిమానులకి ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే.. ‘నరసింహ నాయుడు’ కథ కూడా మెగాస్టార్ చిరంజీవి కోసం అనుకున్నదే. కానీ చిరు ‘అంజి’ ప్రాజెక్టుతో బిజీగా ఉండటం వల్ల.. ఆ కథని బాలయ్యతో తీశారు దర్శకులు బి.గోపాల్. ఇంకో దారుణమైన విషయం ఏంటంటే.. ‘అంజి’ కి పోటీగా బాలకృష్ణ ‘లక్ష్మీ నరసింహ’ రిలీజ్ అయ్యింది. అది సూపర్ హిట్ అయ్యింది. ‘అంజి’ మాత్రం డిజాస్టర్ గా మిగిలిపోయింది.

3) రాజమౌళి ప్రాజెక్టు: ‘అంజి’ సినిమా సెట్స్ లో ఉన్నప్పుడే రాజమౌళి చిరు కోసం ఓ కథని డిజైన్ చేసుకున్నారు. ‘స్టూడెంట్ నెంబర్ 1’ తర్వాత చిరుకి కథ వినిపించే ప్రయత్నాలు చేశారు రాజమౌళి. కానీ ‘అంజి’ హడావిడిలో రాజమౌళి ప్రాజెక్టుని చిరు ఇగ్నోర్ చేయాల్సి వచ్చింది.

 

4)పూరి జగన్నాథ్ ప్రాజెక్టు : చిరుకి వీరాభిమాని అయినటువంటి పూరీ జగన్నాథ్ సైతం చిరు కోసం చాలా కథలు రాసుకున్నారు. ‘ఇడియట్’ సూపర్ హిట్ అయ్యాక.. చిరుని కలిసి కథ వినిపించారు. ఈ ప్రాజెక్టుని కూడా ‘అంజి’ కోసమే మిస్ చేసుకున్నారు చిరు. 

ఇవి మాత్రమే కాదు వి.ఎన్.ఆదిత్య దర్శకత్వంలో ఒక సినిమా, ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా, సురేష్ కృష్ణ దర్శకత్వంలో మరో సినిమా.. ఇలా అల్మోస్ట్ 6 ప్రాజెక్టులని’అంజి’ కోసం పక్కన పెట్టారు చిరు. ‘అంజి’ ఫలితం సంగతి అటుంచి.. కనీసం సకాలంలో ఆ సినిమా చిత్రీకరణ పూర్తైనా.. చిరు 150 సినిమాల ల్యాండ్ మార్క్ కి ఎప్పుడో రీచ్ అయ్యేవరేమో.!

అందుకే చాలా మంది అంటుంటారు..! సినీ పరిశ్రమలో సక్సెస్ ను, ఫెయిల్యూర్ ని అంచనా వేయడం చాలా కష్టం అని. కాదు కాదు అసాధ్యం అనే చెబుతుంటారు..! ఏ సినిమా ఆడుతుందో.. ఏ సినిమా ఆడదో.. అనేది అంచనా వేయగలిగితే.. అందరూ సక్సెస్ఫుల్ మూవీసే తీస్తారు కదా.! కానీ హిట్టు సినిమాకి.. ఫ్లాప్ సినిమాకి.. ‘కష్టం’ మాత్రం ఒకేలా ఉంటుంది. ‘అంజి’ సినిమాకి మెగాస్టార్ చిరంజీవి ఎంతో కష్టపడి చేశారు. టెక్నికల్ టీమ్ కూడా ఏళ్ళ తరబడి శ్రమించారు.నిర్మాత 7 ఏళ్ళ పాటు ఈ సినిమా కోసం చేసిన అప్పులకి వడ్డీలు కడుతూ వచ్చారు. కానీ వీళ్ళ కష్టం సినిమాని నిలబెట్టలేకపోయింది, ఫలితాన్ని మార్చలేకపోయింది.

పాన్ ఇండియా సినిమాకి కావల్సిన కంటెంట్ ఇందులో పుష్కలంగా ఉంటుంది. విజువల్స్ అద్బుతంగా ఉంటాయి. ఈ సినిమా కనుక ఒక 10 ఏళ్ళ తర్వాత వచ్చి ఉంటే.. ఫలితం మరోలా ఉండేదేమో. కానీ ఇప్పుడు మాత్రం ‘ ‘అంజి’ ఓ అండర్ రేటెడ్’ సినిమాగా మాత్రమే మిగిలిపోయింది.

ఆ ఏరియాలో బ్రేక్ ఈవెన్ సాధించిన ‘పెద్ది’

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus