నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తోన్న సినిమా ‘దసరా’. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా బడ్జెట్ దాటిపోతుందని.. దీంతో నిర్మాత ఈ సినిమాను వేరే వాళ్లకు ఇచ్చేశారని వార్తలొచ్చాయి. ఈ వార్తల్లో నిజం లేదని చిత్ర నిర్మాత సుధాకర్ చెరుకూరి వెల్లడించారు. సినిమాను తనే నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ‘దసరా’ సినిమా బిజినెస్ ఇప్పటికే పూర్తయిందని సమాచారం.
ఈ సినిమా ప్రచార చిత్రాలకు మంచి హైప్ రావడంతో.. ఓటీటీ డీల్ కూడా భారీ రేటుకి కుదిరిందని తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ కి రూ.30 కోట్లు ఆఫర్ చేసింది. వేరే భాషలకు చెందిన రైట్స్ మరో రూ.10 కోట్లు పలికాయి. శాటిలైట్ రైట్స్ రూ.20 కోట్లు రాబట్టాయి. వీటితోనే దాదాపు రూ.60 కోట్ల బిజినెస్ జరిగింది. నాని నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాకి రూ.20 కోట్ల థియేట్రికల్ బిజినెస్ మాత్రమే జరిగింది.
‘అంటే సుందరానికి’ సినిమాకి రూ.30 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగింది. ఈ సినిమాలతో నాని రేంజ్ ఏమంత పెరగలేదు. దీంతో ఆ ఎఫెక్ట్ ‘దసరా’పై పడుతుందనుకున్నారు. కానీ అలా జరగడం లేదు. ‘దసరా’ మాస్ సినిమా కావడంతో దీనికి మంచి రేటు పలుకుతుంది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ మొత్తం కలిపి రూ.40 కోట్ల వరకు వస్తుందట.
అంటే ఇప్పటికే ఈ సినిమా రూ.100 కోట్ల బిజినెస్ చేసేసిందన్నమాట. నాని లాంటి మిడ్ రేంజ్ హీరో నటించిన సినిమా, పైగా కొత్త దర్శకుడు.. అయినా కూడా ఈ రేంజ్ బిజినెస్ అంటే విశేషమనే చెప్పాలి. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.
Most Recommended Video