ఇక్కడ.. అక్కడ అని తేడా లేకుండా అన్నిచోట్లా అర్జున్ రెడ్డి ఫీవర్ నడుస్తోంది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గత శుక్రవారం రిలీజ్ అయి అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ కలక్షన్స్ తో దూసుకుపోతోంది. విజయ్ దేవరకొండ ఇందులో యాక్షన్ హీరోగా అదరగొట్టారు. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లో ప్రణయ్ రెడ్డి నిర్మించిన ఈ మూవీ తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.78 కోట్ల షేర్ రాబట్టి ఆశ్చర్యం కలిగించింది. దీనికి అమెరికాలోను ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. ప్రీమియర్ షోతో కలుపుకొని ఒక్క రోజులోనే 1 .24 కోట్ల షేర్ రాబట్టింది.
ఈ సినిమా క్రేజ్ ని చూసి మల్టీఫ్లేక్స్ లో షోస్ పెంచారు. దీంతో అమెరికాలో ఈ సినిమా వన్ మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరింది. స్టార్ హీరోల సినిమాలు సైతం ఈ మార్క్ ని చేరడానికి కష్టపడుతాయి. రీసెంట్ గా తెలంగాణ నేపథ్యంలో వచ్చిన ఫిదా మూవీ 2 మిలియన్ మార్క్ ని చేరుకుంది. ఇప్పుడు అర్జున్ రెడ్డి జోరు చూస్తుంటే త్వరలోనే ఆ మార్క్ ని చేరుకుంటుందని ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.