ఓవర్సీస్ లో కలక్షన్ల వర్షం కురిపిస్తున్న నేనే రాజు నేనే మంత్రి

Advertisement

దగ్గుబాటి రానా సినీ కెరీర్ ని బాహుబలికి ముందు.. బాహుబలికి తర్వాత అని చెప్పుకోవాలి. ఎందుకంటే బాహుబలిలో నటించక ముందు రానా హీరోగా నటించిన సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో కూడా విజయం సాధించక బోల్తా పడేవి. బాహుబలి తర్వాత రానా నటించిన నేనే రాజు నేనే మంత్రి ఇక్కడ, అక్కడ అని తేడా లేకుండా భారీ కలక్షన్స్ రాబడుతోంది. ఇది వరకు ఓవర్సీస్ లో అసలు ఖాతాని ఓపెన్ చేయని రానా.. ఈ చిత్రంతో ఒక మిలియన్ డాలర్ క్లబ్ లో చేరడానికి దూసుకుపోతున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్, బ్లూ ప్లానెట్ ఎంటర్టైనమెంట్స్ సంయుక్తంగా నిర్మించిన “నేనే రాజు నేనే మంత్రి” యూఎస్ లో రిలీజ్ నాడే 140,833 డాలర్లు వసూలు చేసి ఔరా అనిపించింది.

నిన్న మంగళవారం 46,821 డాలర్లను కలెక్ట్ చేసిన ఈ చిత్రం మొత్తం 5 రోజులకు కలిపి 522,692 డాలర్లతో హాఫ్ మిలియన్ క్రాస్ చేసింది. ఈ వీకెండ్స్ నాటికీ   “నేనే రాజు నేనే మంత్రి” వన్ మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరడం గ్యారంటీ అని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read