సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గత చిత్రాలు బ్రహ్మోత్సవం, స్పైడర్ .. రెండూ విజయం సాధించలేకపోయాయి. అయినప్పటికీ మహేష్ సినిమాపై క్రేజ్ కొంచెం కూడా తగ్గలేదు. పైగా పెరిగింది. ప్రస్తుతం మహేష్ కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అను నేను సినిమా చేస్తున్నారు. ఈ మూవీ ఏప్రిల్ 27 న రిలీజ్ చేయాలనీ నిర్మాతలు భావిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈనెల 26 న రిలీజ్ కానుంది. ఫస్ట్ లుక్ విడుదలకు ముందే ఈ సినిమాకి బిజినెస్ మొదలయిపోయింది. వరుసగా హిట్స్ అందుకుంటున్న కొరటాల ఈ సినిమాని కూడా బ్లాక్ బస్టర్ చేస్తారని డిస్టిబ్యూటర్స్ నమ్మకంతో ఉన్నారు.
అంతేకాదు శ్రీమంతుడు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం కాబట్టి శాటిలైట్, డిజిటల్ హక్కులను కొనేందుకు ఎగబడుతున్నారు. ప్రముఖ టీవీ ఛానెల్, అమెజాన్ ప్రైమ్ సంస్థలు భారీ మొత్తాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. అంతేగాక డబ్బింగ్ రైట్స్ కూడ మంచి ధర పలుకుతున్నాయని సమాచారం. ఈ రైట్స్ ధరలు వందకోట్లు దాటిపోయినట్లు టాక్. మరి అధికారికంగా లెక్కలు త్వరలోనే బయటికి రానుంది. మహేష్ ముఖ్యమంత్రిగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.