అక్కినేని కోడలికి 70.ఎం.ఎం క‌టౌట్..!

Advertisement

తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది.. అక్కినేని వారి ఇంటికోడలు సమంత. ఈమె నటించిన తాజా చిత్రం ‘ఓ బేబీ’ జులై 5 న (రేపు) విడుదల కానుంది. ‘మిస్ గ్రానీ’ చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో రెండు విభిన్న పాత్రల్లో సమంత కనిపించనుంది. వయసు మళ్ళిన వృద్ధురాలు మళ్ళీ యుక్త వయసులో కనిపిస్తే ఎలా ఉంటుందో… అలాంటి పాత్రని సమంత పోషిస్తుంది. అయితే వృద్ధురాలి పాత్రని మాత్రం సీనియర్ నటి లక్ష్మి పోషిస్తుంది. సినిమా చాలా బాగా వచ్చిందని దర్శకురాలు నందినీ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తుంది.

ఇదిలా ఉండగా.. హైదరాబాద్ లో ఓ థియేటర్ వద్ద సమంత భారీ కటౌట్ ని పెట్టడం సంచలనంగా మారింది. ఈ కటౌట్ ఫోటోని ట్వీట్ చేస్తూ ఓ అభిమాని ఆసక్తికర కామెంట్ చేశాడు. ‘మా స్నేహితుడు ఈ కటౌట్ ని కొద్దిగా గ్రాఫిక్స్ లో కండలు కనిపించేలా చేసి.. తన జిమ్ అడ్వర్టైజ్మెంట్ కటౌట్ గా వాడుకోవచ్చా.. మీ వీరాభిమాని అయిన అతను మా ఊళ్ళో జిమ్ నడుపుతున్నాడు.. మీరేమంటారు’ అంటూ కామెంట్ పెడుతూ ట్వీట్ చేసాడు. దీనికి సమంత జవాబిస్తూ.. ‘బేబీ ఆన్ స్టెరాయిడ్స్’ అంటూ నవ్వుతున్న స్మైలీస్ ను పెట్టింది. ఏదేమైనా స్టార్ హీరోలకు మాత్రమే కటౌట్లు పెట్టే అభిమానులు ఇలా హీరోయిన్ కు కటౌట్ పెట్టడమంటే విశేషమనే చెప్పాలి. ఏమైనా సమంత క్రేజ్ ఏంటో ఈ కటౌట్ ను బట్టి చెప్పొచ్చు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news