అఖిల్ మూవీ కోసం పోటీ పడుతున్న డిస్ట్రిబ్యూటర్స్!

  • October 10, 2017 / 08:47 AM IST

అక్కినేని ప్రిన్స్ అఖిల్ మొదటి సినిమా అఖిల్ నిరాశ కలిగించినప్పటికీ.. రెండో చిత్రంపై భారీ అంచనాలున్నాయి. కారణం డైరక్టర్ విక్రమ్ కె కుమార్. ఇష్క్, మనం, 24 వంటి విజయాలతో మంచి ఫామ్లో ఉన్న ఈ డైరక్టర్ అఖిల్ ని ప్రేమికుడిగా చూపించబోతున్నారు. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ ని అన్నపూర్ణ స్టూడియో బ్యానర్లో నాగార్జున ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది.

క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న రిలీజ్ కానున్న సినిమాని సొంతం చేసుకోవాలని డిస్ట్రిబ్యూటర్స్ ఎగబడుతున్నారు. విదేశాలకు చెందిన ఓ కంపెనీ హలో ఓవర్సీస్ థియేటర్స్ రైట్స్  కోసం 5 కోట్లను ఆఫర్ చేసినట్లు తెలిసింది. దీనిపై చర్చలు సాగుతున్నాయి. సంతకాలు పూర్తికాగానే అధికారికంగా ప్రకటించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ హలో థియేటర్ హక్కులు భారీ ధర పలకనున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus