పేరు ప్రఖ్యాతలు కొన్ని సార్లు చిక్కులు తెచ్చి పెడుతుంటాయి. ఆ అనుభవం ప్రభాస్ చిత్ర బృందానికి ఎదురైంది. బాహుబలి సినిమా తర్వాత సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేస్తున్నారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనున్న ఈ మూవీలో హీరోయిన్ కోసం చిత్రం బృందం నెల రోజులుగా బాలీవుడ్ బ్యూటీస్ ని సంప్రదిస్తోంది. దీపికా పదుకొనె, పరిణీతి చోప్రాకు కథలు చెప్పారు. వారి ఇతర చిత్రాల డేట్స్ క్లాష్ అవుతుండడంతో చేయమన్నారు.
ఇక తాజాగా ప్రభాస్‌కి జోడీగా శ్రద్ధా కపూర్‌ని అడగగా, ప్రభాస్ పక్కన అనగానే వెంటనే ఒప్పేసుకుంది. కానీ పారితోషికం మాత్రం 8 కోట్లు అడిగిందని తెలిసింది. దాంతో చిత్రబృందం ఆమెను పక్కన పెట్టి ‘లోఫర్’ ఫేం దిశా పటానీని కలిసింది. ఆమెకు ఒకే కానీ రెమ్యునరేషన్ 5 కోట్లు డిమాండ్ చేసింది. ప్రభాస్ కి బాహుబలి తర్వాత ప్రాజక్ట్ కావడంతో అందరూ ఆ రేంజ్ లో పారితోషికం అడుగుతున్నారు. ఇలా ప్రభాస్ కి వచ్చిన పేరు చిత్ర బృందానికి చిక్కులు తెచ్చి పెడుతోంది. ఇక బాలీవుడ్ తారలు కాకుండా టాలీవుడ్ భామలను అడగాలని సుజీత్ టీమ్ డిసైడ్ అయింది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.