నెలాఖరున పోటీకి సిద్ధమవుతున్న యువ హీరోలు

  • August 2, 2018 / 04:21 AM IST

ఇంతకుమునుపు ఎప్పుడో సంక్రాంతికి లేదా దసరాకీ మాత్రమే పోటీపడే హీరోలు ఈమధ్యకాలంలో కనీసం నెలకోసారి పోటీపడుతున్నారు. పెరుగుతున్న హీరోల సంఖ్య కారణంగా సినిమాలు కూడా పెరిగాయి. అందువల్ల వారానికి కనీసం నాలుగైదు సినిమాలు విడుదలవ్వడం షరా మామూలైపోయింది. అందుకు తగ్గట్లే.. ఒక్కోసారి హీరోల నడుమ పోటీ కూడా తప్పడం లేదు. ఒక్కోసారి స్టార్ హీరోలు ఈ విడుదల తేదీల విషయంలో పోటీ పడుతుంటే ఇంకోసారి యువ హీరోలు ఈ పోటీలో నిలుస్తున్నారు.

తాజాగా ఈ పోటీలో నిలిచిన హీరోలు నాగచైతన్య, నాగశౌర్యలు నిలిచారు. నాగచైతన్య నటించిన “శైలజారెడ్డి అల్లుడు” ఈనెల 31న విడుదలవుతుండగా.. అదే రోజున నాగశౌర్య కొత్త సినిమా “@నర్తనశాల” కూడా అదే తేదీకి విడుదలవుతోంది. ఈ రెండు సినిమాల మీద ప్రేక్షకులకి మంచి అంచనాలే ఉన్నాయి. ఈ రెండు సినిమాలూ ఒకేరోజు విడుదలవ్వడం వలన పెద్దగా ఇబ్బందేమీ లేదు కానీ.. రిజల్ట్ తేడా కొట్టిన సినిమాకి మాత్రం పెద్ద సమస్యే. మరి ఈ రెండిట్లో శుక్రవారం విజేతగా ఏ సినిమా నిలుస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus