భారీ ధరకు అమ్ముడుపోయిన వెంకటేష్ గురు శాటిలైట్ హక్కులు

  • December 30, 2016 / 01:21 PM IST

వయసుకు తగ్గ పాత్రలు చేసుకుంటూ విక్టరీ వెంకటేష్ విజయాలను సొంతం చేసుకుంటున్నారు. తనకి సూటయ్యే మరో యాక్షన్ కథతో వస్తున్నారు. హిందీ, తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన ‘సాలా ఖద్దూస్’ సినిమాను తెలుగులో ‘గురు’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఇందులో వెంకటేష్ బాక్సింగ్ కోచ్ గా నటిస్తున్నారు. ఈ మూవీ ఒరిజినల్ వెర్షన్ కి దర్శకత్వం వహించిన సుధా కొంగర తెలుగు వెర్షన్ ను తెరకెక్కిస్తున్నారు. మాతృకలో బాక్సింగ్ స్టూడెంట్ గా నటించిన రితికా సింగ్ ఈ సినిమాతో తెలుగులోనూ ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలయిన నాటి నుంచి అంచనాలు పెరిగిపోయాయి. వెంకటేష్ పుట్టినరోజు సందర్భం గా రిలీజ్ అయిన టీజర్ కూడా ఆకట్టుకుంది. వై నాట్ స్టూడియో బ్యానర్లో శశికాంత్ నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల కానుంది.

ఇంకా ప్రీ రిలీజ్ బిజినెస్ మొదలు కాక ముందే గురు శాటిలైట్ హక్కులు అమ్ముడుపోయాయి. ఇతర ఛానళ్లతో పోటీ పడి ఈ చిత్రాన్ని 5 కోట్లు చెల్లించి జెమిని టీవీ సొంతం చేసుకుంది. ఇంత భారీ ధరకు వెంకీ గత చిత్రాలు ఏవీ అమ్ముడు పోలేదు. ఈ జోరు చూస్తుంటే ఈ సారి గురు కలక్షన్ల సునామీ సృష్టిస్తారని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus