భారీ ధరకు అమ్ముడుపోయిన బాలయ్య సినిమా శాటిలైట్ హక్కులు

  • May 8, 2017 / 10:30 AM IST

నందమూరి బాలకృష్ణ, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా జోరుగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో బాలయ్య, డ్యాన్సర్లపై ఒక పాటను చిత్రీకరిస్తున్నారు. గౌతమి పుత్ర శాతకర్ణి తర్వాత బాలయ్య చేస్తున్న ఈ  సినిమాపై సూపర్ క్రేజ్ నెలకొని ఉంది. అందుకే ఈ చిత్రం శాటిలైట్ హక్కులను సొంతం చేసుకొనేందుకు తెలుగు ఛానళ్ల వాళ్లు పోటీపడినట్లు తెలిసింది. చివరికి ఓ చానళ్ళు వాళ్లు 9 కోట్లు చెల్లించి బాలయ్య 101 వ సినిమా శాటిలైట్ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం.

ఇంకా పేరు కూడా ఖరారు కాకముందే ఈ చిత్రాన్ని కొన్నారంటే దీనిపై ఎంత అంచనాలున్నాయో అర్ధమవుతోంది. మాఫియా నేపథ్యంలో సాగే ఈ కథలో బాలకృష్ణ పక్కన శ్రియ, నూతన నటి ముస్కాన్ నటిస్తున్నారు. ఇందులో బాలయ్య యాక్షన్ తో పాటు. పూరి మార్క్ డైలాగులు కూడా దండిగా ఉంటాయని చిత్ర బృందం వెల్లడించింది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 29న రిలీజ్ కానుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus