భారీగా అమ్ముడుపోయిన చరణ్, సుకుమార్ రంగస్థలం!

  • June 27, 2017 / 10:49 AM IST

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ…టాలీవుడ్ లో టాప్ హీరోగా చక్రం తిప్పిన మెగాస్టార్ అనుకోకుండా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడంతో మెగా వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన చెర్రీ మంచి హీరోగా పేరు సంపాదించుకున్నాడు. అయితే అదే క్రమంలో వరుస హిట్స్ తో దుమ్ము దిలిపేస్తూ దూసుకెళ్తున్న చెర్రీకి అనుకోకుండా వరుస పరాజయాలు వెంటాడాయి. వాటన్నింటినీ అధిగమించి తమిళ సినిమా రీమేక్ తో మంచి హిట్ అందుకుని మళ్లీ తన స్టామినాని టాలీవుడ్ కి రుచి చూపించాడు చెర్రీ. ఇదిలా ఉంటే ధృవ సినిమా తరువాత ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ తో, ప్రయోగాత్మక చిత్రంగా సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్నాడు చెర్రీ. గతంలో జరిగిన ఒక ప్రేమ కధతో ఈ సినిమా తెరకెక్కడం విశేషం.

ఈ సినిమాలో చెర్రీ గెటప్ సైతం చాలా డిఫరెంట్ గా ఉంది. అయితే ఈ సినిమాపై అంచనాల విషయం పక్కన పెడితే…ఈ సినిమా వ్యాపారం మాత్రం భాగా సాగుతుంది. ఇప్పటికే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ 16కోట్ల భారీ రేట్ కి అమ్ముడుపోగా…డిజిటల్ రైట్స్ సైతం అంటే రేంజ్ లో 13కోట్లకు అమ్ముడుపోయాయని ట్విటర్ ద్వారా అందుతున్న సమాచారం. అయితే కొత్తదనం కోసం చెర్రీ చేస్తున్న ప్రయోగంపై భారీ అంచనలను పెంచుకున్నారు బయ్యర్స్. మరి ఈ ప్రయోగం ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus