Huma Qureshi: మీ మాటలకు జవాబు వచ్చేది అప్పుడే.. ‘టాక్సిక్‌’ ట్రోల్స్‌పై హీరోయిన్‌

‘గ్రోన్‌ అప్స్‌ ఫెయిలీ టేల్‌’.. అని ఆ సినిమాకు ట్యాగ్‌లైన్‌గా ఎందుకు పెట్టారో తెలియదు కానీ.. సినిమా నుండి ఇప్పటివరకు వచ్చిన ప్రచార చిత్రాలు చూస్తుంటే కచ్చితంగా ఈ సినిమా ‘గ్రోన్‌ అప్స్‌’కే అనిపిస్తోంది. ఎందుకంటే ఆ వీడియోలు, ఫొటోలు చూస్తుంటే పిల్లలు చూసేలా లేవు. సినిమాకు కచ్చితంగా A సర్టిఫికెట్‌ ఇస్తారు అని చెప్పేయొచ్చు. అయితే ఇప్పుడు పెద్దోళ్లు కూడా ఆ ప్రమోషనల్‌ కంటెంట్‌లోని స్కిన్‌ షో తదితర అంశాల విషయంలో అంత సానుకూలంగా లేరు. కాస్త హద్దు దాటేశారు అని కూడా అంటున్నారు.

Huma Qureshi

ఈ మేరకు ట్రోలర్లు అనబడే వ్యక్తులు కొందరు ‘టాక్సిక్‌’ నిజంగా టాక్సిక్‌లా ఉంది. ఏంటా సన్నివేశాలు అంటూ ముక్కున వేలేసుకుంటున్నట్లు కామెంట్లు చేస్తున్నారు. ఆ సన్నివేశాల్లో నటించిన హీరో యశ్‌ కంటే హీరోయిన్‌ కియారా అద్వానీ మీద ఎక్కువ మాటలు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ సినిమాలో నటించిన మరో హీరోయిన్‌ హ్యూమా ఖురేషీ స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో హ్యూమా మాట్లాడుతూ.. ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందన్నారు. ఇప్పుడు విమర్శలు ఎదుర్కొన్న మహిళలే విజయోత్సాహంతో నవ్వుతారని చెప్పింది.

ట్రోల్స్, ఆన్‌లైన్ వ్యాఖ్యలకు మేం సమాధానం చెప్పడం కంటే, మేం సినిమా కోసం చేసిన పనే సరైన జవాబు చెబుతుంది. సినిమా గురించి దారుణంగా, అవమానకరంగా మాట్లాడుతున్నారు. అయినా మాటలతో ప్రజల మనస్తత్వాన్ని మార్చలేం. అంతా సినిమాకే వదిలేస్తున్నాం. సినమానే ఆ మాటలకు సమాధానం చెబుతుంది అని హ్యూమా చెప్పుకొచ్చింది. ఆగస్టు 26న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమాలో యశ్‌కు జోడీగా తారా సుతారియా, నయనతార, రుక్మిణి వసంత్‌, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషీ నటించారు.

ఇక విమర్శల సంగతి చూస్తే.. ఈ సినిమా ప్రచారంలో భాగంగా తబాహి సాంగ్‌ను విడుదల చేశారు. అందుకే కియార, యశ్‌ రొమాంటిక్‌ సన్నివేశాల్లో కనిపించారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 8న విడుదల కానున్న ‘టాక్సిక్‌’ ట్రైలర్‌పై ఆసక్తి ఎక్కువగా ఉంది. అందులో ఇంకెన్ని ఇలాంటి సీన్స్‌ ఉంటాయో చూడాలి.

కంగనా.. జెన్‌జీ ఎంత పని చేసిందో చూశావా?

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus