భార్య కోసం మొత్తం బుక్ చేసేసాడు!!!

  • July 11, 2016 / 12:09 PM IST

సహజంగా భార్య భర్తల మధ్య గిఫ్ట్స్ అనేవి ఇచ్ఛిపుచ్చుకోవడం ఆనవాయితీ… పండగ వచ్చినప్పుడో, లేకపోతే బర్త్‌డే నాడో, అదీ కాకపోతే పెళ్లి రోజు నాడో అలా ఒకరుకొకరు గిఫ్ట్స్ ఇచ్చుకుంటూ ఉంటారు. అయితే గిఫ్ట్స్ అంటే వస్తు రూపంలో ఉండడం సహజం. కానీ భార్య కోసం భార్య కోరిక తీర్చడానికి ఏకంగా ఆమెకు ఇష్టం అయితే హీరో సినిమా షో మొత్తం కొనేసాడు ఒక యువ తరంగం ఇంతకీ ఎవరు ఆ ప్రియమైన భర్త అంటే….ఈ కధ చదవాల్సిందే…

హిమాచల్ ప్రదేశ్‌లోని హామిర్‌పూర్ పట్టణంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు టాక్ ఆఫ్ ద బాలీవుడ్ గా మారింది. సహజంగా సల్మాన్ ఖాన్ కు వీరాభిమాని అయిన శంకర్ ముసాఫిర్, తాజాగా సల్లు భాయ్ నటించిన సుల్తాన్ సినిమాను ప్రేక్షకుల మధ్యలో కూర్చుని కాకుండా ప్రత్యేకంగా ఈ సినిమాను తన భార్య గీతాంజలి కి చూపించాలి అనే క్రమంలో ఒకరోజు ముందుగానే గురుకుల్ మాల్‌కు వచ్చి ఒక షోను బక్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.. అయితే ఈ విషయాన్ని సాక్షాత్తూ థియేటర్ ఎండీ అమిత్ ఠాకూర్  తెలపడంతో ఇది నిజమే అన్న వార్త అంతటా వ్యాపించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. బహుశా….అభిమానం అంటే ఇదేనేమో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus