నాకు కొత్త మేనేజర్ వొద్దంటున్న కాజల్ ?

  • August 2, 2017 / 12:16 PM IST

ఈ డ్రగ్స్ కేసుల గోల పుణ్యమా అని ఎవరి మీద ఎంత ఎఫెక్ట్ పడిందో తెలీదు కానీ.. క్రేజీ హీరోయిన్ కాజల్ పై మాత్రం ఆ ప్రభావం బాగా ఉంది. అమ్మాయిగారికి ఆ మాయదారి డ్రగ్స్ అలవాటుందో లేదో గానీ.. ఆమె మేనేజర్ డ్రగ్స్ కేసులో పట్టుబడడం వల్ల మేనేజర్ రోని కంటే కాజల్ పేరే ఎక్కువగా వినిపించింది. దాంతో.. అప్పటివరకూ పాజిటివ్ పబ్లిసిటీతో ఉక్కిరిబిక్కిరైన కాజల్.. ఉన్నట్లుండి మొదలైన నెగిటివ్ పబ్లిసిటీతో షాక్ అయ్యింది.

ఉన్న మేనేజర్ ని కాజల్ నిర్దాక్షిణ్యంగా తీసేయడంతో ఇప్పుడు కాజల్ డేట్స్ మేనేజ్ చేయడం కోసం మిగతా మేనేజర్లంతా క్యూ కట్టారు. అయితే.. కాజల్ మాత్రం “నాకు కొత్త మేనేజర్ అవసరం లేదు. మహా అయితే ఇంకో నాలుగేళ్ళు సినిమాలు చేస్తాను, ఈలోపు మా నాన్న చూసుకుంటాడులే” అంటూ తనను కాంటాక్ట్ చేస్తున్న మేనేజర్లందరికీ సమాధానమిస్తుంది కాజల్.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus