కీర్తి సురేష్ ఆనందానికి కారణం ఏమిటి?

  • April 5, 2017 / 09:00 AM IST

బబ్లీ బ్యూటీ కీర్తి సురేష్ ఆనందంలో తేలియాడుతోంది. ఇందుకు కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి నటించడం. తొలుత రామ్ తో నేను శైలజ మూవీ చేసిన ఈ నటి, ఆ తర్వాత నాని తో నేను లోకల్ లో సందడి చేసింది. ఇప్పుడు తెలుగులో ముచ్చటగా మూడో మూవీ షూటింగ్ లో అడుగుపెట్టింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో జల్సా, అత్తారింటికి దారేది తర్వాత పవన్ నటిస్తున్న సినిమా సోమవారం షూటింగ్ మొదలయింది. తొలిరోజు రామోజీ ఫిలిం సిటీలో వేసిన కాఫీ షాప్ సెట్ లో పవన్, అను ఇమ్మానియేల్‌ పై శారద సన్నివేశం చిత్రీకరించారు.

మంగళవారం ఆ సన్నివేశంలోకి కీర్తి సురేష్ ఎంటర్ అయ్యింది. ఈ సందర్భంగా తన సంతోషాన్ని అభిమానులతో పంచుకుంది.  ‘నా కొత్త తెలుగు చిత్రం పవన్‌కల్యాణ్‌ సార్ , త్రివిక్రమ్‌ సార్ తో ఈరోజు మొదలు పెట్టడం ఆనందంగా ఉంది. మీ అందరి ఆశీర్వాదాలు, ఆదరణ కావాలి’ అని కీర్తి సురేశ్‌ ట్వీట్‌ చేసింది. దేవుడే దిగివచ్చిన అనే టైటిల్ పరిశీలిస్తున్న ఈ మూవీలో పవన్ కళ్యాణ్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా కనిపించనున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus