మన మీడియా పరిస్థితి ఎలా అయిపోయింది అంటే బ్రతికి ఉన్నా వాళ్ళను కూడా చంపేసి సెన్సేషన్ చేసేసె అంతగా దిగజారిపోయింది…విషయం లోకి వెళితే….మన లవ్లీ హీరో వరుణ్ సందేశ్ గుర్తు ఉన్నాడా? హ్యాపీ డేస్ మూవీతో ఒక్కసారిగా స్టార్డమ్ పేరు తెచ్చుకున్న యువ హీరో వరుణ్ సందేశ్..కొత్త బంగారు లోకం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అయితే ఆ తరువాత ఎన్నో సినిమా లు చేసినా పెద్దగా సక్సెస్ అయితే కాలేదు..ఇదిలా ఉంటే అప్పట్లో తన సినిమా ప్రేమ ఇష్క్ కాదల్ ఫేం వితిక శేరుని ని ప్రేమించి మరీ వివాహం చేసుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే… డిసెంబర్7, 2015లో వీరిద్దరి నిశ్చితార్ధ వేడుక జరగగా ఆగస్ట్ 8,2016 న ఆలంకృత రిసార్ట్స్ లో వరుణ్, వితికల పెళ్ళి గ్రాండ్‌గా జరిగింది. అయితే పెళ్ళి తర్వాత కొద్ది రోజులు అమెరికాలో ఉండొచ్చిన దంపతులు.. ప్రస్తుతం హైదరాబాద్లో నివసిస్తున్నారు. అయితే ఏంటి అంటారా….అసలు కధ ఇక్కడే ఉంది…అవకాశం దొరికితే…సెలెబ్రెటీస్ బెడ్ రూముల్లోకి కూడా దూరి మరీ హడావిడి చేసే మీడియా….ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్ భార్య, నటి వితిక షేరూ ఆత్మహత్యకు పాల్పడ్డారని, కుటుంబ కలహాల కారణంగానే ఆమె అలాంటి నిర్ణయం తీసుకుందని జోరుగా ప్రచారం చేసింది.
చికిత్స పొందుతున్నట్టుగా కొన్ని ఫోటోలు వైరల్ గా మారడంతో అందరూ నిజం అనే అనుకున్నారు…కానీ…ఇదంతా కధ అని…అంతా రూమర్స్ అని…ట్రాష్ అని అంటున్నారు….ఇక దీనిపై క్లారిటీ ఇచ్చిన వితిక తన ట్విట్టర్ ద్వారా రూమర్స్ కి బ్రేక్ వేసింది. తమపై వస్తున్న న్యూస్ అన్ని ఫేక్ అని, తాము సంతోషంగా ఉన్నాం. పుకార్లను నమ్మొద్దంటూ వితిక ట్వీట్ చేసింది. ఆమె ట్వీట్ చెయ్యకపోతే ఈపాటికి వాళ్ళ లైఫ్ ని రోడ్డుపైకి లాగేసి పబ్బం గడుపుకునే వాళ్ళు మీడియా వాళ్ళు. మొత్తంగా అదీ మ్యాటర్.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.