‘ఫ్లర్ట్’… ఈ మాట తెలియని అమ్మాయి లేదా అబ్బాయి ఉండరేమో.. అనడంలో అతిశయోక్తి లేదు. దాదాపు అందరికీ పదం అలాగే దానికి అర్థం తెలుసనే చెప్పొచ్చు. ఒక అమ్మాయి.. అబ్బాయిని మాటలతో నమ్మించడం అని చెప్పొచ్చు. దీనికి మరో పేరు ‘పులిహోర కలపడం’ అని కూడా అంటుంటారు. సోషల్ మీడియాలో దీని పై చాలా మీమ్స్ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఫ్రెండ్స్ తో కూడా మనం ఎక్కువగా ఈ పదాన్ని వాడుతుంటాం. అయితే ‘ఫ్లర్ట్’ గురించి హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కొత్త డెఫినిషన్ చెబుతుంది.
రకుల్ ప్రీత్ ఓ పక్క వరుస సినిమాలు చేస్తూనే మరోపక్క ఫ్రెండ్స్ తో కూడా బాగా ఎంజాయ్ చేస్తుంటుంది. ‘ఫ్లర్టింగ్’ గురించి రకుల్ మాట్లాడుతూ.. ” ‘ఫ్లర్ట్’ చేసే విద్యలో నాకు గురువు రియా చక్రవర్తినే..! నాకు ఆమె మంచి ఫ్రెండ్. తను ఆ విషయంలో గొప్ప ఎక్స్ పర్ట్. తన నుండీ వీలున్నప్పుడల్లా కొన్ని టిప్స్ తీసుకుంటుంటాను. ఒక అబ్బాయిలో ఎలాంటి లక్షణాలు ఉండాలి అంటే …. ఏ అబ్బాయి అయినా నాకు నచ్చాలంటే తెలివైన వాడు అయ్యి ఉండాలి. నాతో సంభాషణ చేసేటప్పుడు ఆసక్తిని పెంచే విధంగా ఉండాలి. అది ఇద్దరి ఫీలింగ్స్ కి దగ్గరై ఉండాలి. అలా లేకపోతే 2-3 రోజులు… లేదా రెండు వారాలు… లేదా రెండు మూడు నెలల్లోనే విడిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు అతనితో మ్యాచ్ అయ్యే అవకాశం లేనట్టు అర్థం. ఇప్పటివరకూ అలాంటి అబ్బాయి తగల్లేదు. అవతలి వ్యక్తిని చదవడంలోనూ నేను చాలా బ్యాడ్” అంటూ చెప్పుకొచ్చింది. అదంతా అలా ఉంటే… అసలు ఈ బ్లూ కలర్ స్కర్టులో మమ్మల్ని ఫ్లర్ట్ చేయడం కరెక్టేనా..? అంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
మీకు మాత్రమే చెప్తా సినిమా రివ్యూ & రేటింగ్!
విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!.