నెగిటివ్ క్యారక్టర్ చేస్తానంటున్న నాని

  • January 31, 2017 / 10:29 AM IST

టాలీవుడ్ లో అత్యధిక సక్సస్ రేట్ కలిగిన హీరో నాని. పక్కింటి కుర్రోడిలా కనిపిస్తూ వరుసగా విజయాలను సొంతం చేసుకుంటున్నారు. ఇప్పుడు కూడా “నేను లోకల్ ” అంటూ సామాన్య కుర్రోడి కథతో మనముందుకు వస్తున్నారు. నక్కిన త్రినాథ రావు ద‌ర్శ‌క‌త్వంలో శిరీష్ నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 3 న రిలీజ్ కానుంది. నేచురల్ స్టార్ సరసన కీర్తిసురేష్ నటించిన ఈ ఫిల్మ్ కి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు యువతను ఉర్రూతలూగిస్తున్నాయి. ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా నాని ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆసక్తికర విషయాన్నీ వెల్లడించారు. మంచి కథ ఉంటే అందులో నెగిటివ్ రోల్ చేయడానికి తాను సిద్ధమని చెప్పారు.

అంతేకాదు విలక్షణమైన విలన్ గా కనిపించడం తన డ్రీమ్ అంటూ మనసులోని మాటను బయట పెట్టారు. బాహుబలిలో రానా, సరైనోడులో ఆది, బాఘీ లో సుధీర్ బాబు లు విలన్లు గా మంచి పేరు సంపాదించుకున్నారు. 24 లో సూర్య నెగిటివ్ రోల్ లో అదరగొట్టారు. ఎన్టీఆర్ కూడా తన 27 చిత్రం లో విలన్ గా నట విశ్వరూపం చూపించడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. మరి నాని మనసు దోచుకునే విలన్ పాత్రను ఏ దర్శకుడు సృష్టిస్తారోనని  టాలీవుడ్ ఎదురుచూస్తోంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus