అలనాటి తెలుగు చిత్రాల్లో రావణాసురుడు, దుర్యోధనుడు వంటి పాత్రలను మహానటుడు నందమూరి తారక రామారావు పోషించి అదరగొట్టారు. ఆయన విలన్ పాత్రలకు హీరోయిజాన్ని తెచ్చి పెట్టారు. అటువంటి రోల్స్ ఉంటే ఎంతో ఇష్టంగా చేస్తానని అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ చెప్పారు. రెండేళ్ల గ్యాప్ తర్వాత సుమంత్ నటించిన చిత్రం ‘నరుడా డోనరుడా’. మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో సుమంత్ స్పెర్మ్ డోనరుగా నటిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 4న రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘నరుడా డోనరుడా’ లో ఫుల్ కామెడీ ఉంటుందని వివరించారు. ఇందులోని లవ్ స్టోరీ కూడా అందరినీ ఆకట్టుకుంటుందని వెల్లడించారు. హీరోలు విలన్ పాత్రలపై ఆసక్తి కనబరుస్తున్నారు కదా .. మీరు విలన్ పాత్ర చేస్తారా..? అని ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు సుమంత్ సమాధానమిస్తూ “విలన్ పాత్ర చేయడానికి నాకు అభ్యంతరం ఏమి లేదు కానీ అది డిఫరెంట్ గా ఉండాలి. రావణాసురుడు, దుర్యోధనుడు వంటి క్యారెక్టర్ అయితే నటనకు స్కోప్ ఉంటుంది” అని చెప్పారు.
https://www.youtube.com/watch?v=tUbBI2VxV0c