నేచురల్ స్టార్ నాని జెంటిల్ మ్యాన్ సినిమాతో నివేథా థామస్ టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. దీంతో పాటు రెండోసారి కలిసి నటించిన నిన్నుకోరి కూడా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్‌తో జై లవకుశ సినిమా చేస్తోంది. ఇందులో సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడానికి తెలుగు నేర్చుకుంటోంది. తెలుగు భాష మాత్రమే కాదు తెలుగు ప్రజలన్నా తనకి చాలా ఇష్టమని ఈ బ్యూటీ చెప్పింది. ఓ ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ “నాకు సినిమా, చదువు రెండూ ముఖ్యమే. ప్రస్తుతం చెన్నైలోని ఎస్ఆర్ఎమ్ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ చివరి సంవత్సరం (ఐదో సంవత్సరం) చదువుతున్నా.
ఆ యూనివర్సిటీలో ఎక్కువగా తెలుగు విద్యార్థులే ఉంటారు. నన్ను చూసినప్పుడు వచ్చి సెల్ఫీలు అడుగుతారు. ఎవరికీ నో చెప్పలేను. క్లాసులోకి వెళ్లేలోపు దాదాపు 30 మంది దాకా నాతో సెల్ఫీలు తీసుకుంటుంటారు” అని వివరించింది. భవిష్యత్తులో తాను సినిమాల్లో ఉంటానో, ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తానో ఇప్పుడు చెప్పలేనని నివేథా థామస్ వెల్లడించింది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.