“రాంగోపాల్ వర్మ సినిమాల్ని” జనాలు థియేటర్ లో చూడడం ఎప్పుడో మానేసారు. విడుదలయ్యాక.. విశ్లేషకుల రివ్యూలు చదివి “ఫర్వాలేదు” అనుకొంటే కానీ థియేటర్ల వైపుకు కనీసం కన్నెత్తి చూడడం లేదు ప్రేక్షకులు. అందుకు నిదర్శనం వర్మ లేటెస్ట్ రిలీజ్ “ఎటాక్”.
“ఎటాక్” ఓపెనింగ్స్ చూసి భయపడ్డాడో లేక నిజంగానే తన మేకింగ్ స్టైల్ మార్చుకొన్నాడో తెలియదు కానీ.. “నేను మారాను, నా సినిమాల చిత్రీకరణ పధ్ధతి కూడా మారింది. వాటికి నా దర్శకత్వంలో రూపొంది త్వరలో విడుదలవుతున్న “రాయ్, సర్కార్ 3″ చిత్రాలు సాక్ష్యాలుగా నిలుస్తాయి. అందుకు సూచనగా నా డ్రెస్సింగ్ స్టైల్ కూడా మార్చాను చూడండి” అంటూ నిన్న “రాయ్” ఫస్ట్ కు లాంచ్ వేడుకకు ఇన్ షర్ట్ చేసుకొని కాస్తంతా క్లాస్ టచ్ తో హాజరైన ఒక ఫోటోను తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి మరీ చెప్పాడు వర్మ.
మరి వర్మలో వచ్చిన మార్పు ఆయన సినిమాలపై ఎంతవరకూ ప్రభావం చూపుతుందో తెలియాలంటే.. “రాయ్ లేదా సర్కార్ 3” విడుదల తేది వరకూ వేచి చూడాల్సిందే!