చెల్లెలా…నాకా అంటున్న అంజలి..!

  • September 24, 2017 / 02:55 PM IST

అందాల భామ అంజలి గుర్తుంది కదా….అదే అండీ షాపింగ్ మాల్ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఆ పై వరుస సినిమాలతో దూసుకుపోతూ, అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ మంచి సినిమాలు చేస్తూ తన అందాల ఆరబోతతో అందరినీ ఆకట్టుకుంటున్న హీరోయిన్. ఈ భామ ఒక పక్క తమిళ హీరోతో ప్రేమలో ఉంది అన్న వార్తలు బలంగా వినిపిస్తూ ఉన్న క్రమంలో మరో రూమర్ ఈ అమ్మడు గురించి వస్తుంది…అదేంటి అంటే… ఒక్కసారి ఈ కధ చదవండి మీకే తెలుస్తుంది…వివరాల్లోకి వెళితే…తాజాగా మన అందాల నటి అంజలి చెల్లెలు ఆరాధ్య అని, ఆమె సినిమాల్లోకి అడుగుపెట్టబోతుందంటూ రకరకాల రూమర్స్ వస్తున్నాయి…అయితే ఏ సినిమా ఏంటి? ఎప్పుడు ఎంట్రీ అని కొందరు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్న తరుణంలో ఈ వార్తల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి..అవేమిటి అంటే…

ఈ సినిమా మ్యాటర్స్ పై అంజలి స్పందిస్తూ…తనకు చెల్లెలు లేదని ఉన్నదల్లా ఒక అక్క మాత్రమే అని ఆమె పెళ్లి చేసుకొని తను కుటుంబంతో ఉంటుందని, అసలు ఇలాంటి రూమర్స్ ఎలా పుట్టిస్తారు అని, ఇంకా వేరే పని ఏమీ లేదా అంటూ అంజలి మేనేజర్ రియాజ్ కే అహ్మద్ పెట్టిన ట్వీట్‌ని రీ ట్వీట్ చేస్తూ తెలిపింది అంజలి. మొత్తంగా చూసుకుంటే లేని చెల్లెల్ని సృష్టించి ఇలా టైమ్ పాస్ చేస్తున్నారు గాసిప్స్ మహావీరులు..అదీ మొత్తానికి కధ.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus