ఐటెం సాంగ్ అంటూ పిలవవద్దని సూచిస్తున్న అనసూయ

  • February 17, 2017 / 11:00 AM IST

అడల్ట్ కామెడీ షోతో పాపులర్ అయిన హాట్ యాంకర్ అనసూయ నీతులు చెబుతోంది. మొన్నటి మొన్న తనని విమర్శించిన అభిమానులకు క్లాస్ తీసుకున్న ఈ అమ్మడు నేడు విలేఖరులు పాఠాలు చెప్పింది. బుల్లి తెరలో పలు షోలతో బిజీగా ఉన్న ఈ భామ క్షణం, సోగ్గాడే చిన్నినాయనా చిత్రాల తర్వాత మెగాహీరో సాయిధరమ్ తేజ్  మూవీ ‘విన్నర్’ లో “సుయసుయ” అనే ఐటెం సాంగ్ లో అందాలు ఆరబోసింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ ఫిల్మ్ ఫిబ్రవరి 24 న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఆ చిత్ర నటీనటులు ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ రోజు “సుయసూయ” పాట పాడిన సుమ, డ్యాన్స్ చేసిన అనసూయ మీడియా ముందుకు వచ్చారు. ఆ పాట సంగతులు చెప్పారు.

అనంతరం జరిగిన ఓ ఇంటర్వ్యూ లో ఐటెం సాంగ్ ని ఎలా ఎంజాయ్ చేశారు? అని అనసూయను ఓ రిపోర్టర్ అడగగా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. “నాకు ఐటెం సాంగ్ అనే పదమే నచ్చదు. అలా పిలవకండి. స్పెషల్ సాంగ్ అని అనండి” అంటూ వార్నింగ్ ఇచ్చినంత పనిచేసింది. చేసిందంతా చేసి సమర్ధించుకోవడం అంటే ఇదేనని పరిశ్రమ వర్గాలు అనసూయపై ఫైర్ అవుతున్నాయి. నీతులు తగ్గిస్తే మంచిదని సలహా ఇస్తున్నాయి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus