అక్కినేని నాగార్జున నటిస్తున్న సినిమాని ఆయన కొడుకు నాగచైతన్య చూడనని అందరి ముందు చెప్పాడు. ఏంటి పెళ్లి కాకముందే తండ్రి కొడుకుల మధ్య గొడవలు వచ్చాయా?.. చైతూ అలా మాట్లాడుతున్నాడని అపార్ధం చేసుకోకండి. ఎందుకు చూడనని చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం. బుల్లితెర యాంకర్ ఓంకార్ దర్శకత్వంలో వచ్చిన హారర్ కామెడీ ‘రాజుగారి గది’ సినిమా సూపర్ హిట్ అయింది. అందుకు సీక్వెల్ కథ ని సిద్ధం చేయడమే కాదు.. సెట్స్ పైకి కూడా తీసుకెళ్లిపోయారు డైరక్టర్. రాజుగారి గది 2 లో అక్కినేని నాగార్జున, సమంత నటిస్తున్నారు.
నాగ్ హారర్ కామెడీ మూవీ చేయడం ఇదే తొలిసారి. అంతేకాదు సమంత నాగ్ కోడలిగా తెలిసిన తరవాత ఇద్దరూ కలిసి నటిస్తున్న మూవీ కావడంతో దీనిపై భారీ క్రేజ్ నెలకొని ఉంది. ఈ సినిమాని చూడాలని అభిమానులు తొందరపడుతుంటే నాగ్ చైతన్య మాత్రం అస్సలు చూడనని అంటున్నాడు. ఈ మాటల వెనుక దాగిన రహస్యం ఏమిటంటే .. నాగచైతన్యకు హారర్ సినిమాలంటే చాలా భయమట. ఇప్పటివరకు హారర్ మూవీలకు తాను చాలా దూరంగా ఉన్నానని, అందుకే రాజుగారి గది-2’ లో తన తండ్రి, కాబోయే భార్య నటిస్తున్నప్పటికీ చూడనని చెప్పాడు. సినిమా ఏమోగానీ చైతూ మాటలే ఇప్పుడు అందరికీ నవ్వులు తెప్పిస్తున్నాయి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.