ఫాదర్స్ డే ని ఆదివారం ప్రపంచం మొత్తం వేడుకగా జరుపుకుంది. పిల్లలు తమ తండ్రులకు ప్రేమపూర్వక శుభాకాంక్షలు చెప్పారు. కానుకలు ఇచ్చి సర్ప్రైజ్ చేసారు. సినీతారలు వాళ్ల పేరెంట్స్ తో కలిసి గడిపిన మధురమైన క్షణాలను ఫోటోల ద్వారా అభిమానులకు తెలిపారు. ఈ సందర్భంగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ తన తండ్రి సత్యమూర్తి జ్ఞాపకాల్లోకి వెళ్లారు.
పలు తెలుగు హిట్ చిత్రాలకు స్క్రీన్ రైటర్ గా పనిచేసిన ఆయన గత ఏడాది గుండె పోటుతో మరణించారు. దేవి శ్రీ ప్రసాద్ ఒక సెలిబ్రిటీగా ఎదగడంలో సత్యమూర్తి ప్రోత్సాహం ఎంతో ఉంది. అంత చేసిన తండ్రికి ఆరోగ్యం బాగా లేకుంటే మూడేళ్ల క్రితం దేవీ శ్రీ ప్రసాద్ స్పెషల్ కారుని డిజైన్ చేయించాడు. నాన్నకు ప్రేమతో ఇచ్చాడు. ఆ విషయాన్ని ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా సోషల్ మీడియా వేదికలో చెప్పారు. “‘ఫాదర్స్ డే సందర్భంగా మీతో పంచుకోవాలనిపించింది. లవ్యూ డాడీ..’ అంటూ కారు ఫొటోలను పోస్ట్ చేసారు.
I gifted this Specially designed Car 4 my Dad’s Bday 3yrs bak..thot of sharin it on Father’s Day!! Lov U Daddy😘🎹❤️ pic.twitter.com/2Q6cuTlwb2
— DEVI SRI PRASAD (@ThisIsDSP) June 19, 2016