నాకు లిప్ లాక్స్ అనే పదమే ఇష్టం ఉండదు: విజయ్ దేవరకొండ

  • July 23, 2019 / 12:28 PM IST

ముద్దుల్లో విభిన్న కోణాలు బాలీవుడ్ కి పరిచయం చేసిన కథానాయకుడు ఇమ్రాన్ హష్మీ. అతడి తర్వాత ఎందరు స్టార్ హీరోలు ఆన్ స్క్రీన్ లిప్ లాక్స్ తో రెచ్చిపోయినా.. ఇమ్రాన్ హష్మీ రేంజ్ మాత్రం రీచ్ అవ్వలేకపోయారు. అదే తరహాలో టాలీవుడ్ కి లిప్ లాక్స్ కొత్త కాకపోయినా.. ఆ లాక్స్ లో లస్ట్ మాత్రమే కాకుండా ప్రేమ కూడా ఉంటుందని ప్రూవ్ చేసిన హీరో విజయ్ దేవరకొండ. అందుకే.. విజయ్ దేవరకొండ సినిమాలో లిప్ లాక్ అనేది సాధారణ అంశం అయిపోయింది. అందుకే “డియర్ కామ్రేడ్” మొదటి టీజర్ లోనే ఒక లిప్ లాక్ ను వదిలారు దర్శకనిర్మాతలు.

ఇక్కడివరకూ అంతా బాగానే ఉంది కానీ.. విజయ్ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో “నాకు లిప్ లాక్స్ నచ్చవు” అని చెప్పడం సెన్సేషన్ అయ్యింది. అదేంటి మరి తెగ లిప్ లాక్స్ పెట్టేస్తారు కదా అని అడిగితే.. “దాన్ని ముద్దు అంటారు. ముద్దు అనేది ఇద్దరి మధ్య రిలేషన్ ను స్ట్రాంగ్ గా మార్చే అంశం. దానికి మీరు లిప్ లాక్ అని పేరు పెట్టడం నాకు నచ్చలేదు” అని వివరణ ఇచ్చుకొచ్చాడు విజయ్ బాబు. ఈవారం విడుదలకానున్న “డియర్ కామ్రేడ్”లో అర్జున్ రెడ్డి రేంజ్ లిప్ లాక్స్ (సారీ.. ముద్దులు) చాలానే ఉన్నాయట.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus