మిల్కీ బ్యూటీ తమన్నాపై ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా అభినందనల వర్షం కురిపిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఆమె లాంటి డ్యాన్సర్ ని తాను చూడలేదని చెప్పారు. వీరిద్దరూ కలిసి మూడు భాషల్లో తెరకెక్కిన అభినేత్రి సినిమాలో నటించారు. ఈ చిత్రానికి హిందీ, తమిళంలో డెవిల్ అనే పేరును ఖరారు చేశారు. ప్రభుదేవా దర్శకునిగా మారిన తర్వాత నటించడం తగ్గించేశారు. తమిళ చిత్రాల్లో అయితే 2004 తర్వాత కనిపించలేదు. మళ్లీ 12 ఏళ్లకి డెవిల్ చిత్రంతో ముందుకొస్తున్నారు.
ఈ చిత్రం గురించి ప్రభుదేవా మాట్లాడుతూ “విజయ్ కథ చెప్పినప్పుడు నాకు బాగా నచ్చింది. ఈ చిత్రాన్ని నేనే నిర్మించాలని అనుకున్నాను. ఇప్పుడు నేను చేసిన పాత్ర కోసం వేరే నటుడిని తీసుకున్నాం. కానీ అతను పక్కకు తప్పుకోవడం తో నేను నటించాల్సి వచ్చింది. ఫ్యామిలీ సెంటిమెంట్, థ్రిల్, హారర్ వంటి అన్ని అంశాలు ఉన్న ఈ చిత్రం తో రీ ఎంట్రీ ఇవ్వడం నాకు ఆనందంగా ఉంది” అని చెప్పారు. “ఈ చిత్రీకరణలో భాగంగా తమన్నాతో కలిసి ఎక్కువరోజులు ట్రావెల్ చేసాను. ఆమె సిన్సియారిటీ బాగా నచ్చింది. ఈ సినిమాలోని పాత్రకు ఆమె పూర్తి న్యాయం చేశారు” అని వెల్లడించారు.
అభినేత్రి కి సంభందించిన టీజర్ లో తమన్నా డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంటోంది. 70 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రం ఆడియో ఫంక్షన్‌ను ఆగస్ట్ 15న విజయవాడలో చాలా గ్రాండ్‌గా నిర్వహించేందుకు చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఎస్.ఎస్.థమన్, జి.వి.ప్రకాష్‌కుమార్ కలిసి మొదటిసారిగా సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌లో రిలీజ్ చేయనున్నారు.
https://www.youtube.com/watch?v=_pO7hQFWIls