స్టార్ హీరోలకు హీరోయిన్ గానే నటిస్తా

  • January 4, 2018 / 01:48 PM IST

దర్శకుడు నీలకంఠం తెరకెక్కించిన ‘చమ్మక్ చలో..’.. చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన క్యాథరిన్ నానితో పైసా, అల్లు అర్జున్‌తో ఇద్దరు అమ్మాయిలతో, రుద్రమదేవి, సరైనోడు చిత్రాల్లో నటించి అందాలతో అదరగొట్టింది. తేజ దర్శకత్వంలో వచ్చిన నేనే రాజు నేనే మంత్రి సినిమాలో హాట్ గా కనిపించడంతో పాటు సొంతంగా డబ్బింగ్ చెప్పుకొని ఆశ్చర్యపరిచింది. చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో ఆసక్తికర విషయాలు చెప్పింది. “తెలుగులో ఎక్కువ అవకాశాలు వస్తున్న నేపథ్యంలో భాషపై పట్టు ఉండాలని నేను అనుకొన్నాను. అందుకే తెలుగు భాష నేర్చుకోవడంపై సీరియస్‌గా దృష్టిపెట్టాను. దాంతో సన్నివేశాల్లో మంచిగా హావభావాలు ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది” అని తెలుగు నేర్చుకోవడం వెనుకగల కారణం చెప్పింది.

ఇంకా మాట్లాడుతూ ” నా కళ్లలో ఓ ప్రత్యేకత ఉంటుంది. అట్రాక్టివ్‌గా ఉంటుంది అని నీలకంఠ, కృష్ణవంశీ, బోయపాటి శ్రీను చెప్పారు. వారికి నాలో ఇంట్రెస్టింగ్ పాయింట్ అదే. అందుకే వారు నా కళ్ల గురించి కాంప్లిమెంట్ ఇచ్చారు.” అని కేథరిన్ వెల్లడించింది. అయితే స్టార్ హీరోలకు అక్కగా, వదినగా నటిస్తారా ? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. “ప్రభాస్‌కు అక్కగా నటించాల్సి వస్తే అసలు ఒప్పుకోను. పవన్ కల్యాణ్ వదినగా చేయాల్సి వస్తే నో చెప్పేస్తా. సాధారణంగా కథ, పాత్ర మంచిగా ఉంటే నేను ఎవరి పక్కనైనా లవర్‌గా నటించడానికి ఒప్పుకొంటాను” అని తన ఇష్టాన్ని తెలిపింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus