పెళ్ళంటూ చేసుకుంటే ప్రభాస్ నే.. అంటున్న కాజల్..!

  • October 29, 2019 / 06:53 PM IST

అవును కాజల్ ప్రభాస్ ను పెళ్ళిచేసుకుంటుందట. గతంలో ప్రభాస్ తో ‘డార్లింగ్’ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది కాజల్. అప్పట్లోనే వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని వార్తలు కూడా వచ్చాయి. అక్కడితో ఆగలేదు వీళ్ళు పెళ్ళికూడా చేసుకోబోతున్నారని కూడా కథనాలు పుట్టుకొచ్చాయి. అయితే అలాంటిది ఏమీ లేదని.. ప్రభాస్ కొట్టిపారేశాడు. దీంతో తరువాత ప్రభాస్, అనుష్క పెళ్ళి చేసుకోబోతున్నారని ఇప్పటివరకూ టాక్ నడిచింది. అయితే సడెన్ సీన్లోకి కాజల్ ఎందుకొచ్చినట్టు అనేగా మీ డౌట్.

విషయం ఏమిటంటే.. ఇటీవల మంచు లక్ష్మి హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘ఫీట్ అప్ విత్ ది స్టార్స్’ షోలో పాల్గొంది కాజల్. ఈ షోలో పెళ్ళి ఎవరిని చేసుకుంటారు? ఎవరితో జంప్ అవుతారు? అలాగే ఎవరిని చంపేస్తారు? అని మంచు లక్ష్మి అడిగిన ప్రశ్నకు కాజల్ సమాధానమిస్తూ… “ప్రభాస్ కి పెళ్ళి కాలేదు కాబట్టి అతన్ని పెళ్ళి చేసుకుంటా..! తారక్ ని చూస్తే లేచిపోవాలని అనిపిస్తుంది. ఇక రామ్ చరణ్ ని చంపేస్తా” అంటూ కాజల్ సరదాగా కామెంట్స్ చేసింది.

విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus