Idupukayitham : సబ్ టైటిల్స్ లో చూసే మలయాళం సినిమాలు అర్ధం అవుతాయి కానీ “ఈడుపు కాయితం” అనే తెలుగు టైటిల్ అర్ధం అవట్లేదంట !

సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో, బన్నీ వాస్ నిర్మాణంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రం ‘ఈడుపు కాయితం’ తాజాగా ఘనంగా ప్రారంభమైంది. ప్రియదర్శి, నాగదుర్గ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ ముఖ్య అతిథిగా హాజరుకావడంతో ప్రారంభోత్సవం మరింత ఆకర్షణీయంగా మారింది. కాన్సెప్ట్ లాంచ్ కూడా వినూత్నంగా ప్లాన్ చేయడంతో సినిమాపై తొలి రోజే మంచి ఆసక్తి నెలకొంది.

Idupukayitham

అయితే సినిమా ప్రారంభం కంటే ఎక్కువగా ఇప్పుడు టైటిల్ గురించే సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. ‘ఈడుపు కాయితం’ అనే పేరు చాలా మందికి కొత్తగా అనిపించడంతో దాని అర్థం ఏమిటనే ప్రశ్నలు మొదలయ్యాయి. కొందరు ఇది ఒక ప్రాంతీయ మాండలిక పదమని కామెంట్లు చేస్తుండగా, మరికొందరు టైటిల్ వెనుక ఉన్న నేపథ్యం తెలుసుకోవాలని ఆసక్తి చూపుతున్నారు.

తెలంగాణ ప్రాంతంలో గతంలో వినిపించే ‘ఈడుపు కాయితం’ అనే పదం, పరస్పర అంగీకారంతో జరిగే అనధికార విడిపోవడాన్ని సూచించే పదంగా ఉపయోగించబడేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఆ పద్ధతి పెద్దగా అమల్లో లేకపోయినా, ఆ పదాన్ని కథకు అనుగుణంగా టైటిల్‌గా ఎంపిక చేసినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మరోవైపు, టైటిల్‌ను మాత్రమే ఆధారంగా చేసుకుని సినిమాపై అభిప్రాయాలు వ్యక్తం చేయడం సరైన పద్ధతి కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. కథ, ట్రైలర్ లేదా సినిమా విడుదల కాకముందే విమర్శలు చేయడం కంటే, మేకర్స్ చెప్పాలనుకున్న కథను చూసిన తర్వాత నిర్ణయం తీసుకోవడం మంచిదని సినీ అభిమానులు అంటున్నారు. ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ టైటిల్‌పై జరుగుతున్న చర్చ వల్ల సినిమాకు మొదటి రోజు నుంచే మంచి పబ్లిసిటీ లభించింది. సోషల్ మీడియాలో పేరు వైరల్ కావడంతో ప్రేక్షకుల్లో కూడా సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది. ఇక ‘ఈడుపు కాయితం’ వెనుక అసలు కథ ఏమిటో తెలుసుకోవాలంటే చిత్ర బృందం విడుదల చేసే తదుపరి అప్డేట్స్ కోసం వేచి చూడాల్సిందే.

Bahubali 3 : చాలాకాలం తరువాత ప్రభాస్, అనుష్క, రానా ఒకే ఫ్రేమ్ లో….!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus