నచ్చితే చూస్తారు..నచ్చకపోతే చూడరు!!!

  • April 12, 2016 / 10:40 AM IST

పవన్ కల్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ మ్యాటర్ సెటిల్ అయిపోయింది. దాదాపుగా బిజినెస్ క్లోస్ అయిపోయింది. అయితే చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అన్న సామెత విన్నట్లు, ఈ సినిమాకు ఎంత కలెక్షన్స్ రాబట్టుకోగలిగితే అంత మంచిది అన్న ఉద్దేశంతో, పవన్ సినిమాను ఎలా అయితే భుజాలపై వేసుకుని వన్ మ్యాన్ షో చేసాడో, అలానే సినిమాని ప్రమోట్ చేస్తూ కలెక్షన్స్ రాబట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అయితే వరుసగా అనేక పత్రికలకు, టీవీ ఛానెళ్లకు ఇంటర్‌వ్యూస్ ఇస్తున్న మన పవర్ స్టార్ సర్దార్ గబ్బర్ సింగ్ రివ్యూస్ పై కొన్ని సంచలన వ్యఖ్యలు చేశాడు. ప్రఖ్యాత టీవీ ఛానెల్ టీవీ9 అధినేత రవి ప్రకాష్ చేసిన ఇంటర్‌వ్యూ లో పవన్ ను రవి అడుగుతూ….సర్దార్ గబ్బర్ సింగ్ కు మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి దానిపై మీ స్పందన ఏంటి అని అనగానే, ఆ ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు పవన్. పవన్ మాట్లాడుతూ…ఈసినిమా సెకండ్ ఆఫ్ సరిగ్గా రాలేదని బాగా స్లో అయ్యిందని మరీ రొటీన్ గా ఉంది అని చాలామంది చేసిన కామెంట్స్ తన దృష్టి వరకు వచ్చాయి అని పవన్ చెపుతూనే, తన ‘తొలిప్రేమ’ సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా పనికి మాలిన కుర్రాళ్ళ కథ అని విమర్శకులు చాలా నెగేటివ్ రివ్యూస్ ఇచ్చారన్న విషయాన్ని పవన్ గుర్తుకు చేసుకుంటూ ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది కదా అని ఎదురు ప్రశ్న వేసాడు పవన్. అంతేకాదు అందరికీ నచ్చే విధంగా సినిమాలు తీయడం ఎవరివల్లా కాదని అందువల్ల తన సినిమాలు నచ్చినవారు చూస్తారు లేదంటే నచ్చని వారు చూడరు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు పవన్. అయితే ఎవరెన్ని చెప్పినా ఈ సినిమా బయ్యర్స్ కు మాత్రం నష్టాలనే మిగిల్చింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus