ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!

  • July 14, 2022 / 03:17 PM IST

ఒకప్పటి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ టి.కృష్ణ గారు తీసిన సినిమాలను అంత ఈజీగా ఎవరూ మర్చిపోలేరు. ఆయన తీసిన సినిమాలు ప్రతీ ఒక్కరిలో స్ఫూర్తిని నింపడమే కాకుండా.. బాక్సాఫీస్ వద్ద కూడా కాసుల వర్షం కురిపించేవి. సామాజిక స్పృహ కలిగిన సినిమాలను ఫైట్స్ వంటివి లేకుండా అంత కమర్షియల్ గా ఆయన ఎలా తీసేవారు అని ప్రతి దర్శకుడు జుట్టు పీక్కునేవారు అనడంలో అతిశయోక్తి లేదు. అనుకోకుండా ఆయన చనిపోవడం.. ఆయన కుటుంబానికి ఎక్కడ లేని కష్టాలు వచ్చి పడడం జరిగింది. కానీ ఆయన చిన్నబ్బాయి గోపీచంద్ మాత్రం ఇప్పటికీ సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్నాడు.

ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్ లో వచ్చిన ‘తొలి వలపు’ చిత్రంతో హీరోగా పరిచయమైన గోపీచంద్ ఆ చిత్రం ప్లాప్ అవ్వడంతో వెంటనే డౌన్ అయిపోయాడు.అయితే రూటు మార్చి విలన్ గా ‘జయం’ ‘నిజం’ ‘వర్షం’ వంటి సినిమాలు చేశాడు.ఈ సినిమాలు అతన్ని మాస్ ఆడియన్స్ బాగా దగ్గర చేశాయి . దీంతో మళ్ళీ ‘యజ్ఞం’ తో హీరోగా మారాడు. ఇక అక్కడి నుండి ఇతను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం పడలేదు. వీళ్ళ నాన్నగారు కనుక ఉండి ఉంటే ఇంకా పెద్ద స్టార్ హీరో అయ్యి ఉండేవాడేమో కానీ.. ఇప్పటికైతే ఓ స్టైలిష్ యాక్షన్ హీరోగా నిలిచాడు. సొంతంగా కథలు ఎంపిక చేసుకుని అతను ఈ స్టేజిలో ఉండడం అంటే మాటలు కాదు.

అయితే గోపీచంద్ కు ఇప్పటికీ సరైన సినిమా పడలేదు అనేది చాలా మంది అభిప్రాయం. హిట్ సినిమాలు ఇతని ఖాతాలో చాలా ఉన్నాయి. కానీ వాటికి స్టార్ డైరెక్టర్ల ఇమేజ్ కనుక తోడై ఉంటే కచ్చితంగా ఇతను స్టార్ హీరో అయ్యుండేవాడు అనడంలో అతిశయోక్తి లేదు. ప్రభాస్ తర్వాత ఆ రేంజ్లో యాక్షన్ సీన్స్ తో ప్రేక్షకులను అలరించే హీరో గోపీచంద్ అనడంలో అతిశయోక్తి లేదు. కానీ అతని కటౌట్ కానీ…అతని మాస్ ఇమేజ్ కానీ వేస్ట్ అయిపోతుంది అని కూడా చాలా మంది నమ్ముతున్నారు. కొంతమంది మాస్ ఇమేజ్ ఉన్న దర్శకులు కనుక మన గోపీచంద్ తో సినిమాలు చేస్తే.. ప్రేక్షకులకు యాక్షన్ ఫీస్ట్ గ్యారెంటీ అని చెప్పొచ్చు. గోపీచంద్ కు అలాంటి కరెక్ట్ డైరెక్టర్లు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

1) రాజమౌళి :

గోపీచంద్ పై రాజమౌళి ఎందుకు ఇప్పటి వరకు ఫోకస్ పెట్టలేదు అనేది చాలా మంది అభిప్రాయం. భవిష్యత్తులో కనుక జక్కన్న.. గోపీచంద్ ను డైరెక్ట్ చేస్తే.. ఓ రేంజ్ బ్లాక్ బస్టర్ గ్యారంటీ. ఏమైనా షార్ట్ టైంలో సినిమా తీయాలని జక్కన్న అనుకుంటే మన గోపీచంద్ తో తీస్తే బాగుంటుంది.

2) వి.వి.వినాయక్ :

గోపీచంద్ కు ఉన్న మాస్ ఇమేజ్ కు.. వినాయక్ లాంటి మాస్ డైరెక్టర్ .. ఓ మాస్ సినిమా తీస్తే రిజల్ట్ అదిరిపోద్ది.

3) బోయపాటి శ్రీను :

రామ్ వంటి యంగ్ హీరోలని మాత్రమే కాదు.. మన గోపీచంద్ పై కూడా ఫోకస్ పెట్టు బోయన్నా..!

4) కొరటాల శివ :

గోపీచంద్ నాన్నగారు కనుక ఈరోజు ఉంటే కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేసే బాధ్యతని తీసుకునే వారు. గోపీచంద్ లో ఉండే మాస్.. కొరటాల సినిమాల్లో ఉండే సోషల్ మెసేజ్ తో కనుక సినిమా వస్తే.. యునానిమస్ హిట్ టాక్ ను సంపాదించుకుంటుంది అనడంలో అతిశయోక్తి లేదు.

5) హరీష్ శంకర్ :

బోయపాటి మాత్రమే కాదు హరీష్ కూడా గోపీచంద్ తో అదిరిపోయే మాస్ సినిమా తీయొచ్చు.

6) పూరి జగన్నాథ్ :

ఆల్రెడీ ‘గోలీమార్’ చేశారు… ఇంకోసారి కూడా ఈ కాంబోలో సినిమా వస్తే బాగుంటుంది.

7) సంపత్ నంది :

‘గౌతమ్ నంద’ ‘సీటీమార్’… అక్కడితో ఆపొద్దు..! మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే కాంబో ఇది..!

8) అనిల్ రావిపూడి :

గోపీచంద్ చేసిన ‘శౌర్యం’ ‘శంఖం’ సినిమాలకి రైటర్ గా చేశాడు అనిల్. ఈసారి వీరి కాంబినేషన్లో ఓ మంచి సినిమా పడితే బొమ్మ బ్లాక్ బస్టరే..!

9) బాబీ :

గోపీచంద్ కు ఉన్న మాస్ ఇమేజ్ కి బాబీ కూడా సరైన దర్శకుడు. ఈ కాంబోలో సినిమా వచ్చినా సూపర్ హిట్ గ్యారెంటీ.

10) గోపీచంద్ మలినేని :

వీరి కాంబినేషన్ లో ‘డాన్ శీను’ మిస్ అయ్యింది. కానీ వీరి కాంబోలో ‘క్రాక్’ లాంటి సినిమా వస్తే సూపర్ హిట్ అవ్వడం గ్యారంటీ.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus