దేవదాసు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఇలియాన పోకిరితో టాలీవుడ్ టాప్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. ఇక్కడ అవకాశాలున్నప్పటికీ బాలీవుడ్ లో అవకాశం రాగానే ముంబై లో మకాం వేసింది. గత ఐదేళ్ళలో ఐదు చిత్రాలను మాత్రమే చేసిన ఇలియానా తెలుగులోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి కష్టపడింది. శ్రీనువైట్ల దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కుతోన్న అమర్ అక్బర్ ఆంటోనీ” సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈమె ఆస్ట్రేలియాకు చెందిన ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో ప్రేమలో ఉన్నట్టు గతంలో అనేక ఫోటోలు స్పష్టం చేశాయి. తాజాగా అతనే తన భర్త అని వెల్లడించింది. సోషల్ మీడియా వేదికపై ఆమె అభిమానులతో చాట్ చేసింది. వారు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం ఇచ్చింది.
తెలుగులో రీ ఎంట్రీ గురించి అడగగా.. ఎనిమిదేళ్ల తర్వాత టాలీవుడ్‌లో నటిస్తున్నానని, చాలా హ్యాపీగా వుందని తెలిపింది. ఇక మీ జీవిత భాగస్వామి ఎవరు? అని ఓ అభిమాని ప్రశ్నించగా.. ఎటువంటి దాపరికం లేకుండా మంచి మనసున్న వ్యక్తి ఆండ్రూ నీబోన్ ని పిచ్చిగా ప్రేమిస్తున్నానని.. అతనే తన భర్త ని చెప్పింది. ఎందుకు వేరే దేశం వ్యక్తిని ఇష్టపడ్డారని మరో ప్రశ్నకు ఇలియానా సమాధానమిస్తూ.. “నాకు అతడి రంగు, దేశంతో అవసరం లేదు. అతని ప్రేమని మాత్రమే చూసాను. అలాగే లైఫ్‌లో కుటుంబాన్ని దూరం చేసుకోలేను. నాకు ప్రేమ ముఖ్యం” అని వివరించింది. దీంతో ఇలియానా త్వరలోనే ఇరుకుటుంబాల పెద్దల అంగీకారంతోనే పెళ్లిచేసుకోబోతున్నట్టు అర్ధమయింది.