ఇలియానాకు అంత పొగరెందుకు??

టాలీవుడ్ టాప్ బ్య్యూటీస్ లో ఒకరైన ఇలియానా…ప్రముఖ దర్శక నిర్మాత వైవీయస్ చౌదరి పుణ్యమా అని టాలీవుడ్ లో బలమైన హీరోయిన్ గా స్థిరపడిపోయింది. అయితే అందాల ఆరబోతకు బౌండరీస్ ఏమీ పెట్టుకొకపోవడంతో ఆమె వరుస ఆఫర్స్ తో టాలీవుడ్ లో దూసుకుపోయింది. సన్నని నడుము…ప్రతీ పాటలోనూ ఆమె సియగాల పరిమళాలను వెదజల్లుతూ ఉండడంతో సాక్షాత్తూ తమిళ టాప్ దర్శకుడు శంకర్ కూడా ఆమెకు అవకాశం ఇచ్చే అంత ఎత్టుకి ఎదిగింది ఈ గోవా బ్యూటీ. ఇదిలా ఉంటే టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ తో దూసుకుపోతూ టాప్ స్టేజ్ కి చేరుకోబొతుంది అన్న సమయంలో అనుకోని రాంగ్ స్టెప్ ఆమె కరియర్ ను పూర్తిగా మార్చివేసింది అన్నట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తుంది.

అనుకోకుండా ఆమె బాలీవుడ్ చెక్కెయ్యడం. ఇక మన వాళ్ళు కూడా ఆమె టాలీవుడ్ లో పూర్తిగా ఉంటుందో ఉండాదో అన్న ఆలోచనతో ఆమెకు అవకాశాలు ఇవ్వకపోవడం షరా మామూలుగా జరిగిపోయాయి. ఇదిలా ఉంటే అవకాశాల విషయమై ఇలియానా తాజాగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది…’నేను కష్టపడ్డాను కాబట్టే.. ఇవాళ బాలీవుడ్ లో ఈ స్టేజ్ లో ఉన్నా. ఇక్కడ ఓ అవకాశం వచ్చిందంటే అది నీ ట్యాలెంట్ కారణంగానే. అవకాశాన్ని ఉపయోగించుకుంటే నిలబడగలం లేకపోతే కెరీర్ క్లోజ్ అంతే. నేను అవకాశాల కోసం ఎవరినీ అడుక్కోను. అది డిగ్నిటీకి సంబంధించిన విషయం’. అని చాలా కొత్తగా మాట్లాడింది. అయితే ఈ కామెంట్స్ ను రకరకాలుగా చర్చించుకుంటున్నారు సినిమా సర్కిల్స్ వాళ్ళు….ఈ డైలాగ్స్ అన్నీ టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ను గురించే అంటూ న్యూస్ టాలీవుడ్ లో చక్కెర్లు కొడుతుంది. మరి దీనిపై ఏ నిర్మాత అయినా కౌంటర్ వేస్తారేమో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus