మరో పెద్ద చిత్రానికి ఓకే చెప్పిన గోవా బ్యూటీ

  • July 6, 2018 / 05:57 AM IST

గోవా బ్యూటీ ఇలియానాకి కంటే ఆమె నడుముకి ఎక్కువమంది ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తికాదు. పోకిరి సినిమాలో ఆమె అందానికి కుర్రకారు దాసోహం అన్నారు. ఆమె మాత్రం బాలీవుడ్ లో అవకాశం రాగానే తెలుగువారికి టాటా చెప్పి.. హిందీ వారికి హాయ్ చెప్పింది. బాలీవుడ్ సినీ ప్రేమికులు మొదట్లో విజయాలు అందిస్తే.. ఆ తర్వాత మేకర్స్ మాత్రం అవకాశం కూడా ఇవ్వలేదు. దీంతో తనని ఆదరించిన టాలీవుడ్ వైపు చూసింది. నువ్వు వస్తానంటే వద్దంటామా అని మైత్రి మూవీ మేకర్స్ వారు పిలిచి అవకాశం ఇచ్చారు. అంతేకాదు పునః స్వాగతం పలికారు.

“నువ్వు మళ్లీ తెలుగు సినిమా చేస్తుండడం చాలా ఆనందంగా ఉంది ఇలియానా” అంటూ `అమర్ అక్బర్ ఆంటోని` తరఫున వెల్కమ్ చెప్పారు. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో ఇలియానా లుక్ బయటికి రాకముందే ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఓ బడా నిర్మాణ సంస్థ స్టార్ హీరోతో నిర్మించనున్న సినిమా కోసం ఆమెను సంప్రదించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిలిం నగరవాసులు చెప్పారు. ఆ సినిమా వివరాలు త్వరలోనే అధికారికంగా బయటికి చెప్పనున్నారు. ఇలియానా జోరు చూస్తుంటే మళ్లీ టాలీవుడ్ టాప్ హీరోయిన్ స్థానం సంపాదించుకునేలా ఉంచి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus