దీవుల్లో ఎర్ర బికినీతో హీట్ పుట్టిస్తున్న ఇలియానా

గోవా బ్యూటీ ఇలియానా నడుము వంపుల్లో ఎంత పదును ఉందో.. పోకిరి సినిమాకి తెగిన టికెట్లను అడిగితే చెబుతాయి. ఆమె అందానికి తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఆ అందానికి ఆకర్షితులైన బాలీవుడ్ ఫిలిం మేకర్స్ ఆహ్వానించారు. ఇంకేముంది అక్కడికి మకాం మార్చింది. తెలుగు ప్రేక్షకులను మిస్ చేసుకుంది. కానీ శ్రీను వైట్ల ఆమెకు ఛాన్స్ ఇచ్చారు. అమర్ అక్బర్ ఆంటోనీ మూవీలో హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇస్తోంది. రవితేజ హీరోగా తెరకెక్కుతోన్న ఈ మూవీ అమెరికాలో షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమా కోసమే కష్టపడుతోంది. అయితే ఈ సినిమాలో జాయిన్ కాకముందు ఇలియానా గోవా టు ఫిజీ దీవులకు వెళ్ళింది. అక్కడే బీచ్ లేక్ ఫెస్టివల్ ల్లో ఎంజాయ్ చేసింది.

ఫిజీ బ్రాండ్ అంబాసిడర్ గా తనవంతు న్యాయం చేసింది. ఆ వీడియో తాజాగా యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. ఇందులో ఓ రేంజులో హొయలు పోయింది. ఫిజీ టూరిజం కోసం బోలెడంత ప్రచారం చేసింది. మధ్య మధ్యలో తళుక్కున బికినీలో మెరుస్తూ ఊపు తెచ్చింది. గత నెలరోజులుగా ఈ ఫోటోషూట్ కి సంబంధించి ఒక్కో ఫోటోని ఇలియానా సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తోంది. తాజాగా రివీల్ చేసిన ఎర్రబికినీ లుక్ యువతని గిలిగింతలు పెడుతోంది. నల్లరంగు కళ్లద్దానికి కాంబినేషన్ తెలుపు వైట్ ఫ్లవర్ తో అదరగొడుతోంది. ఈ ఫోటో వైరల్ అయింది. వీడియో అయితే ఎక్కువ వ్యూస్ అందుకుంటోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus