తెలుగు చిత్రసీమలో కథానాయికగా నెగ్గుకురావాలంటే.. కథానాయకులు, నిర్మాతలు, దర్శకులతో మంచి ర్యాపో మెయింటైన్ చేయాలి. మీడియాతో అయితే మహా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఇండస్ట్రీ మీద ఎలాంటి బ్యాడ్ కామెంట్స్ చేయకూడదు. అందుకే.. రాధిక ఆప్టేకి తెలుగులో ఆఫర్లు రావడం లేదు. ఒక నెలరోజుల క్రితం ఇలియానా కూడా రాధిక ఆప్టే తరహాలో తెలుగు చిత్రసీమపై విరుచుకుపడింది. తెలుగు ఇండస్ట్రీలో అంతా మేల్ డామినేషన్ అని, అక్కడ నేవల్ కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ హీరోయిన్స్ కి ఇవ్వరని బాలీవుడ్ మీడియా ముందు తెలుగు ఇండస్ట్రీ పరువు తీసిపారేసింది.
అలాంటి ఇలియానాకు బాలీవుడ్ లో ఆఫర్లు లేకపోవడం.. ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకొనే ఆలోచన కూడా లేకపోవడంతో టాలీవుడ్ నుంచి ఆఫర్ రాగానే గెంతుకుంటూ హైద్రాబాద్ వచ్చేసింది. రవితేజ “అమర్ అక్బర్ ఆంటోనీ” సినిమా నుంచి డేట్స్ ఇష్యూ కారణంగా అను ఎమ్మాన్యూల్ తప్పుకోవడంతో.. ఆమె స్థానంలో ఇలియానాను ఎన్నుకొన్నారు. ఎక్కువ రెమ్యూనరేషన్ ఏమీ ఆశించకుండానే ఇలియానా ఈ సినిమాకి సైన్ చేసిందట. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటుంది.