“చక్కనమ్మ చిక్కినా అందమే” అనే నానుడి తెలియనిది కాదు. అలాగే.. “మరీ బక్కగా ఉండేవారు కాస్త లావేక్కినా అందమే” అనేది సరికొత్త సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని ఫాలో అయ్యే “కిక్” సినిమా టైమ్ లో కాస్త ఒళ్ళు చేసింది గోవా బ్యూటీ ఇలియానా. ఆ తర్వాత మళ్ళీ తన రెగ్యులర్ సైజ్ అయిన “జీరో సైజ్”కి వచ్చేసిందనుకోండి. వరుసగా బాలీవుడ్ ఆఫర్లు వస్తున్నప్పుడు తెగ కష్టపడిపోయి “జీరో సైజ్”ను మెయింటైన్ చేసిన బెల్లీ బ్యూటీ ఇలియానా.. ఈమధ్య ఆఫర్లు సరిగా లేకపోవడం వల్ల బద్దకించిందో లేక కావాలనే పెరిగిందో తెలియదు కానీ.. కాస్త బుగ్గలొచ్చి మళ్ళీ “కిక్” లుక్ లోకి వచ్చేసింది.
ప్రస్తుతం ఇలియానా టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇవ్వడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. తాను ఇదివరకు వర్క్ చేసిన డైరెక్టర్స్ మరియు హీరోలకు ఆదే పనిగా కాల్స్ చేస్తూ అవకాశాల కోసం అడుగుతుందట. మరి ఇలియానా ప్రయత్నాలు ఫలిస్తే.. ఆమె నడుమందాలు చూసే భాగ్యం మళ్ళీ మన తెలుగువారికి దక్కుతుంది!