రామ్ చరణ్ సినిమాలో ఇల్లీ బేబీ స్పెషల్ సాంగ్

  • November 26, 2018 / 07:04 AM IST

పాపం ఆరేళ్ళ తర్వాత “అమర్ అక్బర్ ఆంటోనీ”తో రీఎంట్రీ ఇచ్చి తన సెకండ్ ఇన్నింగ్స్ ను సక్సెస్ ఫుల్ గా స్టార్ట్ చేద్దామనుకున్న ఇలియానా ఆశలన్నీ సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే గగనమైపోయాయి. అప్పటివరకూ ఆమె వెనుక క్యూ కట్టిన దర్శకనిర్మాతలు కూడా వెనక్కి తగ్గారు. సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఇలియానాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఆ రెస్పాన్స్ ను క్యాష్ చేసుకోవాలనుకొంటున్నాడు బోయపాటి. రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న “వినయ విధేయ రామ” చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ లో ఇలియానాను నటింపజేయాలనుకొంటున్నాడు.

అయితే.. ఆ స్పెషల్ సాంగ్ కోసం ఇలియానా ఆల్మోస్ట్ 60 లక్షలు అడుగుతున్నట్లు టాక్. ఇదే పాట కోసం రకుల్ ప్రీత్ సింగ్ ను కూడా అడిగారు. ఆమె బిజీగా ఉండడంతో రెమ్యూనరేషన్ ఎక్కువైనా.. ఇలియానాతోనే ఆ ఐటెమ్ సాంగ్ ను చేయాలనుకొంటున్నారు దర్శకనిర్మాతలు. సో, “అమర్ అక్బర్ ఆంటోనీ”లో మిస్ అయిన ఇలియానా హొయలు మరియు క్రేజీ డ్యాన్స్ మూమెంట్స్ ను “వినయ విధేయ రామ”లో చూడొచ్చన్నమాట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus