ప్రియుడు గురించి పట్టించుకోని ఇలియానా..!

  • November 16, 2019 / 01:24 PM IST

ప్రేమలో పడితే కెరీర్ సం*****నా***పోద్ధి… అని పెద్ద వాళ్ళు ఊరికినే అనలేదని కొంతమంది హీరోయిన్లను చూస్తే అర్థమవుతుంది. ఆ హీరోయిన్లు మరెవరో కాదు శృతీ హాసన్, ఇలియానా. ప్రస్తుతానికి ఇలియానా గురించి మాట్లాడుకుందాం. టాలీవుడ్ లో ఆమె ఒకప్పుడు ‘గోల్డెన్ లెగ్’ అనిపించుకుంది. తెలుగులో స్టార్ హీరోలందరి సరసన నటించేసింది. తరువాత బాలీవుడ్ కు వెళ్ళి సినిమాలు చేసుకుంది. అక్కడ కెరీర్ బాగానే ఉండడంతో అక్కడే సెటిల్ అయిపోయింది. అప్పుడప్పుడు తెలుగుసినిమాల్లో నటించేది అనుకోండి.

అంతా బానే ఉంది అనుకుంటుండగా… ఆస్ట్రేలియాకు చెందిన ఫోటో గ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో ప్రేమలో పడింది. అంతే ఇంక ఈమె కెరీర్ పై ఫోకస్ పెట్టడం మానేసింది. పోనీ వీళ్ళిద్దరూ పెళ్ళి చేసుకున్నారా అంటే… సడెన్ గా బ్రేకప్ అయ్యి అందరికీ షాకిచ్చారు. ఈ విషయం పై ఇలియానా తాజాగా స్పందించింది. ‘ఆ విషయాలు నేను ఎప్పుడో మరచిపోయాను, ప్రస్తుతం నా ఫోకస్ అంతా వర్క్ మరియు కెరీర్ పైనే ఉంది. ఆహారపు అలవాట్ల విషయంలో మార్పులు చేశాను.. గతంతో పోల్చితే ఇప్పుడు హెల్తీ మరియు ఫిట్ గా ఉన్నాను” అంటూ జ్ఞానోదయం వచ్చినట్టే మాట్లాడుతుంది. ఇలా అయితే మంచిదే.. ఇప్పటికైనా సినిమాల పై ఫోకస్ పెడుతుందేమో చూడాలి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20


తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus