బాలీవుడ్ మేకర్స్ కు బంపర్ ఆఫర్ ఇస్తున్న ఇలియానా!

  • November 12, 2019 / 09:52 AM IST

బాలీవుడ్ మీద వ్యామోహంతో తెలుగులో మార్కెట్ పోగొట్టుకొన్న హీరోయిన్లలో ఇలియానా ఒకరు. తెలుగులో విశేషమైన స్టార్ డమ్ ఎంజాయ్ చేస్తున్న తరుణంలో బాలీవుడ్ ఆఫర్లు వచ్చాయంటూ అమ్మడు అక్కడికి షిఫ్ట్ అయిపోయింది. ఏవో రెండు మూడు సినిమాలు తప్పితే పెద్దగా ఆఫర్లేమీ రాలేదు. అయితే అప్పటికే అమ్మడు ప్రేమలో ఉండడంతో ఆఫర్ల గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు బ్రేకప్ తర్వాత ఆఫర్లు మీద ధ్యాస మళ్లిస్తోంది.

ఇలియానా నటించిన “పాగల్ పంటీ” వచ్చేవారం విడుదలవుతోంది. ఈ చిత్రంలో ఇలియానా మెయిన్ హీరోయిన్. అయితే.. మరో ఇద్దరు హీరోయిన్ ఉండడంతో ఈమెకు సోలో ప్రమోషన్స్ చేసుకొనే అవకాశం దొరకడం లేదు. దాంతో.. తనకు హీరోయిన్ సెంట్రిక్ సినిమా చేయాలని ఉందని, అవకాశం వస్తే వదులుకొనని చెప్పుకొచ్చింది. అలాగే.. కథ నచ్చితే రెమ్యూనరేషన్ తగ్గించుకోవడానికి తాను వెనకాడనని స్పష్టం చేసింది. మరి ఇలియానా ఇచ్చిన ఈ బంపర్ ఆఫర్ ను బాలీవుడ్ దర్శకనిర్మాతలు ఏమేరకు సద్వినియోగపరుచుకొంటారో చూడాలి.

17 ఏళ్ళ కెరీర్లో ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాలేంటో తెలుసా..?
వయసుకు మించిన పాత్రలు చేసి మెప్పించిన టాలీవుడ్ హీరోలు..!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus