ఇలియానాకు.. సైకియాట్రిస్ట్ తో పని పడిందట..!

టాలీవుడ్ లో ఈమెకు గోల్డెన్ లెగ్ అనే పేరుంది. వరుసగా స్టార్ హీరోలతో సినిమా చేసి మరింత రేంజ్ పెంచుకుంది. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో బాలీవుడ్ కు చెక్కేసింది. తరువాత రీ ఎంట్రీ ఇచ్చినా ఉపయోగం లేకుండా పోయింది. ఇంతకీ ఈమె ఎవరో ఈపాటికే మీకు తెలిసిపోయుండాలి. యెస్.. గోవా బ్యూటీ ఇలియానా..! గతంలో ఈమె ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ అండ్రూ నీబోన్ ను పెళ్ళిచేసుకోబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే ఇటీవల ఈమె ఆండ్రూతో విడిపోయిందట. ఈ విషయం పై గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నప్పటికీ క్లారిటీ లేకపోవడంతో.. ఇవి గాసిప్స్ లే అనుకుని లైట్ తీసుకున్నారు. కానీ ఇలియానా సన్నిహితుల నుండీ వస్తున్న సమాచారం ప్రకారం… బ్రేకప్ అయిన తరువాత ఇలియానా మానసికంగా ఇబ్బంది పడింది డిప్రెషన్ కు వెళ్ళిపోయిందట. ఈ క్రమంలో సైకియాట్రిస్ట్ ని కలిసి… అనేక థెరపీ సెషన్స్ లో పాల్గొందట. ఇలా డిప్రెషన్ నుండి బయటపడి తిరిగి ఇప్పుడు సినిమాలు చేయడానికి రెడీ అవుతుందని’ ఇలియానా సన్నిహితులు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈమె చేతిలో కొన్ని బాలీవుడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయట. ‘ఇక జన్మలో మళ్ళీ ప్రేమ జోలికి పోను’ అని కూడా ఇలియానా చెప్పిందట.

1

2

3

4

5

6

7

8

9

10

మీకు మాత్రమే చెప్తా సినిమా రివ్యూ & రేటింగ్!
విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus