పెళ్లి అంటే నో…అంటున్న హాట్ బ్యూటీ…!

  • August 23, 2017 / 08:28 AM IST

బాటల్ నెక్ నడుముతో తన అందాల ఆరబోతతో కుర్రకారుని కిర్రేకించిన సుందరి ఇలియానా…టాలీవుడ్ లో కొన్నాళ్ళు టాప్ హీరోయిన్ గా చెలరేగిపోయింది. వరుస సినిమాలతో, సూపర్ హిట్స్ తో దూసుకెళ్లిన ఇలియానా అనుకోకుండా బాలీవుడ్ కి చెక్కెసి అక్కడే సెటిల్ అయిపోయింది. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఉన్న ఇలియానా బాలీవుడ్ లో సైతం మంచి సినిమాలే చేసి మంచి హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియాకు చెందిన 29 ఏళ్ల ఫొటోగ్రాఫర్ అండ్ర్యూ నీబోస్ తో సహజీవనం చేస్తున్న ఇలియానా…ఒక మాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన ప్రేమ గురించి చెప్పుకొచ్చిన ఇలియానా ఆండ్రూ తనకి చాలా దగ్గరైన వ్యక్తి అనీ ఇద్దరూ ప్రస్తుతం సహజీవనం లో ఉన్నాం అనీ చెప్పుకొచ్చింది.

అయితే మరి పెళ్లి ఎప్పుడు అని అడగగా…పెళ్ళా…చి చి…అంటూనే పెళ్ళికీ సహజీవనానికీ మధ్యన చాల తేడా ఉంది అని, పెళ్లి అయిపోయిన తరవాత ఆనందం అనేది ఎక్కువగా ఉండదు కానీ సహజీవనం లో ఆ ఆనందం ఉంటుంది అంటోంది ఈ సెక్సీ బ్యూటీ…ఇక  సినిమా పరిశ్రమ లో 11 సంవత్సరాలు గా కొనసాగుతున్న తాను అకారణంగా వ్యతిరేకత ని సంపాదించుకున్నా అని అంతేకాకుండా తాము చేసే వ్యాఖ్యలు కూడా కొన్ని సార్లు వివాదాస్పదం అవుతుంటాయని… ఇలాంటి ఇబ్బందుల్లోకి ఆండ్ర్యూని లాగడం తనకు ఇష్టం లేదని అంటుంది ఈ బ్యూటీ. ఏది ఏమైనా…బాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఇలియానా అక్కడ పద్దతులకు కూడా సరే అంటూ సహజీవనానికి సై అంటూ పెళ్ళికి నై అనేస్తుంది. ఎంతైనా కలికాలం….కదా


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus