స్పెషల్ సాంగ్స్ చేయకపోవడానికి కారణం చెప్పిన ఇలియానా

  • November 29, 2018 / 12:24 PM IST

బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలో ఇలియానాది పుష్కర కాలం దాటిన ప్రయాణమే. తెలుగులో నటిగా పరిచయమై తమిళం, హిందీకి చేరిందీ గోవా సుందరి. అతి చిన్న వయసులో సినిమాల్లోకి వచ్చింది ఇలియానా. ఆ వయసుకు తగినట్లే నిర్ణయాలు తీసుకున్నాను..కానీ ఇప్పుడు సినిమాల ఎంపికలో పరిణితి చూపిస్తు న్నా అన్నది ఈ సుందరి మాట. అందుబాటులో ఉన్న అన్ని పరిశ్రమల్లో నాయికలు తిరగడం అలవాటే. ఇలియానా ఇలాగే ప్రయా ణం చేసింది. కానీ బాలీవుడ్‌లో వరుసగా మంచి అవకాశాలు రావడం వల్లే ఇతర భాషల్లో నటించ లేకపోయా అని చెబుతోంది. ఇక ప్రత్యేక గీతాల కోసం చాలా మంది నిర్మాతలు తనను సంప్రదిస్తున్నారని, అయితే అవేమీ ఆసక్తికరంగా అనిపించడం లేదని చెప్పింది ఇలియానా. వయసును బట్టే పరిపక్వత వస్తుంది.

అనుభవంతోనే మంచి నిర్ణయాలు తీసుకోగలం. నేను నాయికను అయ్యేప్పటికి నా వయసు 20 ఏళ్లు. కాబట్టి నా చిత్రాల ఎంపికలు అలాగే ఉండేవి. కానీ అనుభవంతో పాటే మంచి సినిమాల్లో నటించడం ప్రారంభించాను. నటనకు ప్రతిభ ఉండి, కొంతకాలం నాయికగా నన్ను గుర్తుపెట్టుకునేలా సినిమాలు చేయాలని ఉంది. ప్రత్యేక గీతాల కోసం సంప్రదింపులు జరుగుతున్నాయి. ఇప్పటికైతే అవేమీ ఆసక్తి కలిగించడం లేదు అని చెప్పుకొచ్చింది ఇలియానా.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus